సంగారెడ్డి : భారత దేశ తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ జయంతిని పురస్కరించుకుని గురువారం జిల్లా మహిళా ప్రాంగణం, బాలసదన్ కేంద్రంలో మహిళా శిశు సంక్షేమశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన బాలల దినోత్సవ వేడుకల లోజిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు ముఖ్య అథిదిగా పాల్గొన్నారు. ఈ సందర్భముగా చిన్నారులతో కేక్ కట్ చేసిబాలల దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు .
ఈ సందర్భముగా కల్లెక్టర్ మాట్లాడారు. పిల్లలు అనుకున్న లక్ష్యాన్ని చేరాలంటే మంచి చదువు అవసరం అని అన్నారు, చిన్నారులే రేపటి రోజున దేశాన్ని ముందుకు తీసుకెళ్లేదిని అన్నారు. బాల సదనం లో ఉన్న సౌకర్యాలతో చిన్నారులు సద్వినియోగం చేసుకుంటూ మంచి భావిభారత పౌరులుగా ఎదగాలన్నారు. చిన్నారులకు మంచి విద్య, మంచి ఆరోగ్యం, మంచి బాల్యాన్ని అందించడమే కర్తవ్యం అన్నారు. ప్రతి ఒక్కరూ జీవితంలో ఒక లక్ష్యం ఏర్పాటు చేసుకొని దానికి అనుగుణంగా కష్టపడాలి. భవిష్యత్తులో మంచిగా చదువుకొని ఎదగాలని, చదువుని నమ్ముకుంటే తప్పకుండా బంగారు భవిష్యత్తు ఉంటుందన్నారు. నేను కూడా చదువునే నమ్ముకుని ఉన్న స్థానంలో ఉన్నానని విద్యార్థులకు తెలిపారు . పిల్లలందరూ సమాజానికి సేవ చేసే స్థానంలో ఉండాలి. మన మీదనే మనం నమ్మకం పెట్టుకొని అనుకున్న లక్ష్యాన్ని సాధించాలని అన్నారు. చిన్నారుల ప్రదర్శించిన సాంస్కృతి కార్యక్రమాలను తిలకించి, చిన్నారులకు బాలలదినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు .
ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి లలిత కుమారి, చి న్న పిల్లల వైద్యులు చక్రపాణి , CWC Member వెంకటేశం , DCPO రత్నం, బాల సదనం సిబ్బంది DCPU సిబ్బంది పాల్గొన్నారు..