కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలంలోని ఖాసీంపేట గ్రామ శ్రీ మానస దేవి ఆలయంలో ఈనెల 18వ తేదీ నుంచి జరిగే శ్రీ చక్ర ప్రతిష్టాపన కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఆలయ కమిటీ సభ్యులు కోరారు. మంగళవారం ఆయా పార్టీల అధ్యక్షులు ప్రజాప్రతినిధులతో ఆలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈనెల 15వ తేదీన శ్రీ చక్ర ను గుండ్లపల్లి నుంచి గునుకుల కొండాపూర్ జంగపల్లి,హనుమాజిపల్లి మైలారం,గన్నేరువరం మాదాపూర్,పారువెళ్ల, వడ్లూరు గ్రామాల మీదుగా ఆలయం వరకు మహిళల కోలాటాల మధ్య శోభయాత్ర ఊరేగింపుగా తీసుకురావడం జరుగుతుందని తెలిపారు.. ఆయా గ్రామాలలోని మహిళలు భక్తులు ఈ శోభాయాత్రలో పాల్గొని శ్రీ అమ్మవారి ఆశీస్సులు పొందాలని కోరారు. ఈ కార్యక్రమంలో జడ్పిటిసి మాడుగుల రవీందర్ రెడ్డి, ఆలయ గౌరవ అధ్యక్షుడు నర్సింహారెడ్డి, ఆలయ చైర్మన్ ఏలేటి చంద్రారెడ్డి, ఆలయ ప్రధాన అర్చకులు నాగసాయి శర్మ, బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు గంప వెంకన్న, ఉప సర్పంచ్ సంపత్ రెడ్డి ఆయా పార్టీల అధ్యక్షులు సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.