హైదరాబాద్ : ఎమ్మెల్యేలు, ఎమ్మెల్యేల శిక్షణా తరగతులకు వెళ్లవద్దని కేటీఆర్ తన పార్టీ ఎమ్మెల్యేలకు పిలుపునిచ్చారని, దీంతో బీఆర్ఎస్ మానసిక స్థితి ఏమిటో తెలుస్తోందని మంత్రి శ్రీధర్ బాబు విమర్శించారు. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలకు ఈరోజు నుంచి ప్రభుత్వం శిక్షణా తరగతులను నిర్వహిస్తోంది. ఈ క్రమంలో శ్రీధర్ బాబు ఓ టీవీ ఛానల్‌తో మాట్లాడుతూ… ప్రతిపక్షం ప్రతి దానిని రాజకీయం చేయాలని చూస్తోందన్నారు.
కేటీఆర్ ఆశల పల్లకిలో ఉన్నారని, అందుకే నాలుగేళ్లలో అధికారం వస్తుందని పగటి కలలు కంటున్నారని విమర్శించారు. ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ విగ్రహాలను ఎవరూ తొలగించలేరన్నారు. ఎమ్మెల్యేల శిక్షణా తరగతులకు రావొద్దని కేటీఆర్ చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. మళ్లీ బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందా? అని ఎద్దేవా చేశారు. తెలంగాణ తల్లి విషయంలో కావాలని రాజకీయం చేస్తున్నారని ధ్వజమెత్తారు.