contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

పిడుగురాళ్ల లో ఘనంగా శ్రీహరి పుట్టినరోజు వేడుకలు

సినీ నటుడు, రియల్ స్టార్ శ్రీహరి పుట్టినరోజు వేడుకలను పిడుగురాళ్ల పట్టణంలో శ్రీహరి ఫ్యాన్స్ అసోసియేషన్ ఘనంగా నిర్వహించింది. పట్టణంలోని జానపాడు రోడ్ లో గల రాఘవ టీ స్టాల్ వద్ద మంగళవారం శ్రీహరి పుట్టినరోజుని పురస్కరించుకొని అన్నదాన కార్యక్రమాన్ని పల్నాడు వైడ్ శ్రీహరి ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ములగుండ్ల రాఘవ నిర్వహించారు. ఆగస్టు 15వ తేదీ శ్రీహరి పుట్టినరోజు కావడంతో ఆయన అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రాఘవ మాట్లాడుతూ సినీ నటుడు శ్రీహరి ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షునిగా పిడుగురాళ్ల పట్టణంలో ఆయన వేడుకలను ప్రతి సంవత్సరం నిర్వహిస్తుంటామన్నారు. ఆగస్టు 15వ తేదీ శ్రీహరి పుట్టినరోజు తో పాటు శ్రీహరి ఫ్యాన్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు దుగ్గిరాల సీతారామయ్య, ఏటుకూరి సీతారామయ్య ల పుట్టినరోజులు కావడంతో వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నామన్నారు. పల్నాడు వైడ్ శ్రీహరి ఫాన్స్ అసోసియేషన్ అధ్యక్షునిగా 2000 సంవత్సరం నుండి ములగుండ్ల రాఘవ శ్రీహరి పుట్టినరోజు వేడుకలను పట్టణంలో ఘనంగా నిర్వహిస్తున్నారు. అలాగే సమాజ సేవలో తన వంతుగా పలు సేవా కార్యక్రమాలు కూడా నిర్వహించడం జరిగింది. అన్నదాన కార్యక్రమంలో ఆయనతోపాటు మిత్రులు, శ్రీహరి అభిమానులు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

 Don't Miss this News !

Share :