శ్రీకాకుళం : రాజం తహశీల్దార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. మండలంలోని కొండంపేట గ్రామంలో ఖాళీ స్థలం సర్వే నిర్వహించేందుకు సర్వేయర్ చంద్రరావు రూ.30వేలు డిమాండ్ చేశారు. దీంతో బాధితుడు సలాది రాందాస్ ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. ఈ క్రమంలో సోమవారం బాధితుడి నుంచి సర్వేయర్ రూ. 10వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రైడ్ చేసి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.