ఆర్మీలో ఉద్యోగాలు ఇప్పిస్తామని ఉద్యోగార్థుల నుంచి డబ్బులు తీసుకొని వారిని దారుణంగా హింసిస్తున్న ఇండియన్ ఆర్మీ కాలింగ్ సంస్థ ఫౌండర్ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఏపీలోని శ్రీకాకుళం జిల్లా ఐఏసీ (ఇండియన్ ఆర్మీ కాలింగ్) సంస్థ ఫౌండర్, బసవ రమణ అనే వ్యక్తి ఇలా యువకులను శారీరకంగా హింసిస్తున్నాడు. ఒకరిద్దరు కాదు కొన్ని వేలాదిమంది విద్యార్థులు అతని బాధితులుగా ఉన్నట్లు సమాచారం. వారి జీవితాలతో బసవ రమణ ఆడుకుంటున్నాడు.
గతంలో అనగా నాలుగు సంత్సరాల క్రితం బివి రమణ బాగోతం బయట పెట్టింది రిపోర్టర్ టీవీ. డబ్బులు దండుకొని శ్రీకాకుళం నుండి పరారయ్యి కరీంనగర్ లో మకాం పెట్టినప్పుడు రిపోర్టర్ టీవీ చొరవతీసుకుని జిల్లా కలెక్టర్ అలాగే కరీంనగర్ సిపి కి సమాచారం ఇవ్వడంతో అక్కడనింది పరారయ్యి విశాఖపట్నం చేరుకున్నాడు. ప్రస్తుతం శ్రీకాకుళం లో మకాం పెట్టి ఎందరినో మోసం చేస్తున్నాడు.
ఆర్మీలో, నేవీలో, ఎయిర్ ఫోర్సులో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ విద్యార్థుల దగ్గర రూ. 5 నుంచి రూ. 10 లక్షల వరకు వసూలు చేసినట్లు తెలుస్తోంది. ఈ విషయంలో చాలా సీరియస్ గా యాక్షన్ తీసుకోవాలంటూ ఓ ఎక్స్ (ట్విట్టర్) లో హల్చల్ అవుతుంది బివి రమణ బాగోతం. ఇకనైనా ఉన్నతాధికారులు స్పందించి తగు చర్యలు తీసుకుంటారా లేదా వేచి చూడాలి.