జమ్మూకశ్మీర్ పోలీసులు, భద్రతా బలగాలు ఉమ్మడిగా శ్రీనగర్‌లో భారీ ఉగ్రకుట్రను భగ్నం చేశాయి. నిషేధిత ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్‌తో సంబంధమున్న నలుగురు ప్రధాన ఉగ్రవాదులను భద్రతా బలగాలు శనివారం సాయంత్రం అదుపులోకి తీసుకున్నాయి. వీరివద్ద పేలుడుకి ఉపయోగించే అమ్మోనియంతో పాటు ఆయుధాలను గుర్తించినట్టు పోలీసులు వెల్లడించారు. ఇంటెలిజెన్స్ నుంచి సమాచారం అందడంతో శ్రీనగర్ శివారు ప్రాంతమైన నౌగామ్‌లోని కెనిహామా ప్రాంతంలో మొబైల్ వెహికల్ చెక్ పోస్ట్ ఏర్పాటు చేసి ఉగ్రవాదులను పట్టుకున్నామని వెల్లడించారు.
నిర్దిష్టమైన సమాచారం ఉండడంతో శ్రీనగర్ పోలీసులు, సీఆర్‌పీఎఫ్ బృందాలు ఉమ్మడిగా ఈ పోస్టును ఏర్పాటు చేశామని, శనివారం సాయంత్రం ఉగ్రవాదులను పట్టుకున్నామని కశ్మీర్ పోలీసులు ప్రకటన విడుదల చేశారు. ఈ నలుగురు ఉగ్రవాదులకు నిషేధిత ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్‌తో సంబంధాలు ఉన్నాయని ప్రాథమిక దర్యాప్తులో తేలిందని వెల్లడించారు. పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశామని వెల్లడించారు.
తనిఖీలు నిర్వహించామని, అటుగా వాహనంలో వచ్చిన నలుగురు ఉగ్రవాదులను అదుపులోకి తీసుకున్నారని వెల్లడించారు. తీవ్రవాదుల పేర్లు మహ్మద్ యాసీన్ భట్, షెరాజ్ అహ్మద్ రాథర్, గులాం హసన్ ఖండే, ఇంతియాజ్ అహ్మద్ భట్ అని వెల్లడించారు. వీరిలో ముగ్గురు శ్రీనగర్‌లోని జఫ్రాన్ కాలనీ పాంథా చౌక్‌కు చెందినవారు కాగా ఒకరు పాంపోర్‌కు చెందినవారని వివరించారు. ఉగ్రవాదుల వద్ద 3 మ్యాగజైన్‌ల ఏకే 56 రైఫిల్, 7.62 x 39 ఎంఎం 75 రౌండ్లు, 2 మ్యాగజైన్‌ల గ్లోక్ పిస్టల్, 9 ఎంఎం 26 రౌండ్ల పిస్టల్, 6 చైనీస్ గ్రెనేడ్‌లతో పాటు ఇతర ఆయుధాలు, అమ్మోనియం ఉన్నాయని, వాటిని స్వాధీనం చేసుకున్నామని పోలీసులు వివరించారు.
Srinagar Police alongwith SF's busted JeM #terror module, 04 #terrorist associates arrested & huge cache of Arms/Ammunition recovered from their possession. FIR registered, #Investigation set in progress. pic.twitter.com/D3au5eFw7k
— Kashmir Zone Police (@KashmirPolice) March 23, 2024