contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

బిఆర్ఎస్ తోనే రాష్ట్ర అభివృద్ధి : బోయినపల్లి వినోద్ కుమార్

  • ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్,ఎమ్మెల్యే రసమయి బాలకిషన్
  •  డబుల్ రహదారితో మహర్దశ
  •  గునుకుల కొండాపూర్ ప్రత్యేక సర్కిల్ ఏర్పాటు

కరీంనగర్ జిల్లా: ది రిపోర్టర్ టీవీ: తెలంగాణ రాష్ట్రం ఏర్పాటై కేసీఆర్ సీఎం అయ్యాక తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయానికి 24 గంటల కరెంటు ఇవ్వడంతో పాటు మూడున్నరేళ్ల కాలంలోనే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంతో పాటు అనేక అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టామని తెలంగాణ ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్, మానకొండూర్ ఎమ్మెల్యే, తెలంగాణ సాంస్కృతిక సారథి చైర్మన్ రసమయి బాలకిషన్ అన్నారు.ఈ సందర్భంగా మంగళవారం గన్నేరువరం మండలంలోని గుండ్లపల్లి నుంచి ఇల్లంతకుంట మండలంలోని పొత్తూరు వరకు రూ.71కోట్ల వ్యయంతో డబుల్ రోడ్డు నిర్మాణానికి భూమిపూజ చేశారు. ముందుగా గన్నేరువరం నుండి గుండ్లపల్లి కి బైక్ ర్యాలీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ జెండా ఊపి ప్రారంభించి గ్రామ గ్రామాన పూలవర్షంతో స్వాగతం పలికారు. మండల కేంద్రంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేశారు, అనంతరం జడ్పిటిసి మడుగుల రవీందర్ రెడ్డి, బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు గంప వెంకన్న ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో బోయినపల్లి వినోద్ కుమార్, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాక ముందు రైతులకు వ్యవసాయానికి కోతల కరెంటుతొ సాగు చేసిన పంటలు ఎండిపోయేవని, సాగు కోసం రైతులు చేసిన అప్పులు పెరిగి కాంగ్రెస్ పాలనలో రైతు ఆత్మహత్యలు ఉండేవన్నారు. సాగు నీరు లేక రైతులు గల్ఫ్ దేశాలతో పాటు ముంబాయి, బీవండి, హైదరాబాద్ వంటి ప్రాంతాలకు వలస వెళ్ళేవారని పేర్కొన్నారు.ఒకప్పుడు తెలంగాణ రాష్ట్రంలో రైతులు వలసలు వెళ్లే వారని, ఇప్పుడు తెలంగాణ రాష్ట్రానికి ఇతర రాష్ట్రాల నుంచి ఇక్కడకు కూలీలు వలసలు వస్తున్నారని పేర్కొన్నారు. రైతులు వడ్డీ వ్యాపారుల వద్దకు వెళ్లి అప్పులు తెచ్చి పంటలు సాగు చేసుకునే వారని, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక సీఎం కేసీఆర్ రైతులకు పెట్టుబడి సాయం కింద ఎకరాకు రూ.10 వేల పెట్టుబడి సాయం అందిస్తున్నారని అన్నారు. రైతులు ఏదైనా కారణంతో మరణిస్తే రైతు కుటుంబాలు రోడ్డున పడొద్దనే సంకల్పంతో రైతుభీమా పథకం ద్వారా రూ.5లక్షల సాయం అందించడం జరుగుతుందని పేర్కొన్నారు. రైతులకు గత ఎన్నికల సమయంలో ఇచ్చిన మాట ప్రకారం సీఎం కేసీఆర్ రూ.లక్ష రుణమాఫీ చేయడం జరుగుతుందని అన్నారు. సీఎం కేసీఆర్ మాట ఇస్తే తప్పకుండా నెరవేరుస్తారని అన్నారు. రైతుల సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు.తెలంగాణ రాష్ట్రం వస్తే నక్సలైట్లు పెరుగుతారని, కరెంటు ఉండదని, కరెంటు తీగలపై బట్టలు ఎండబెట్టుకునే పరిస్థితి వస్తుందని అప్పటి సీమాంధ్ర సీఎం కిరణ్ కుమార్ రెడ్డి అన్నారని, ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో 24 గంటల నిరంతర కరెంటు ఇచ్చి రైతులకు అండగా నిలుస్తున్నారని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో 25వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుందని అన్నారు.కాంగ్రెస్ నాయకులు పగటి బిచ్చగాళ్ల మాదిరిగా తమ అడ్రస్ గల్లంతు అవుతుందని ఉనికిని కాపాడుకోవడానికి రోజుకో వేషం వేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు బురద రాజకీయాలు చేస్తున్నారని ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ అన్నారు. గుండ్లపల్లి నుంచి పొత్తూరు వరకు డబుల్ రోడ్డు నిర్మాణానికి ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఇల్లు లేని నిరుపేదలకు సొంత స్థలం ఉంటే రూ.మూడు లక్షలు అందిస్తామని, దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరికి ఇల్లు మంజూరి చేస్తామన్నారు. దళితులకు దళితబంధు పథకం ద్వారా రూ 10లక్షల సాయం చేస్తామని పేర్కొన్నారు. బీసీ బంధు పథకం ద్వారా అర్హులైన వారికి రూ.లక్ష సాయం అందిస్తామని అన్నారు.మానకొండూర్ నియోజకవర్గంలో గత పదేళ్ల కాలంలో కోట్లాది రూపాయలతో అభివృద్ధి చేశామని పేర్కొన్నారు. కరీంనగర్ ఎంపీగా గెలిచిన బండి సంజయ్ నాలుగున్నరేళ్ల కాలంలో పార్లమెంట్ పరిధిలో నయాపైసా పని చేయలేదని అన్నారు. వాట్సాప్ యూనివర్సిటీ లో మాత్రమే బీజేపీ అభివృద్ధి కనిపిస్తుందని విమర్శించారు. ఈకార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే,విప్ ఆరెపల్లి మోహన్,బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు సుడా చైర్మన్ జివి రామకృష్ణారావు, రాజన్న సిరిసిల్ల జిల్లా జెడ్పి వైస్ చైర్మన్ సిద్ధం వేణు,ఆర్.బి.ఎస్ జిల్లా కోఆర్డినేటర్ గుడెల్లి తిరుపతి, వైస్ ఎంపీపీ న్యాత స్వప్న సుధాకర్, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షులు గూడెల్లి అంజనేయులు, రైతు సమన్వయ సమితి జిల్లా డైరెక్టర్ గొల్లపల్లి రవి, సర్పంచుల ఫోరం అధ్యక్షులు తీగల మోహన్ రెడ్డి, ఉప సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు బూర వెంకటేశ్వర్,పార్టీ మండల ఉపాధ్యక్షుడు కొట్టే భూమయ్య,వివిధ గ్రామాల సర్పంచులు అట్టికం శారద,కర్ర రేఖ,మహిళా అధ్యక్షురాలు కుసుంబ నవీన, కోఆప్షన్ సభ్యులు రఫీ, జిల్లా నాయకులు తోట కోటేశ్వర్, మానకొండూర్ యువజన సంఘాల అధ్యక్షుడు గూడూరి సురేష్, నాయకులు అట్టికం రవి, మండల సోషల్ మీడియా కోఆర్డినేటర్ నక్క దామోదర్,మండల యూత్ అధ్యక్షుడు బోయిని కుమార్,వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

 Don't Miss this News !

Share :