- ఎన్నో ఏళ్లుగా పనిచేస్తున్న ఉద్యోగ భద్రత కరువు
- ఏడు రోజులుగా కార్మికులు చేస్తున్న సమ్మెకు మద్దతు తెలిపిన బిజెపి మానకొండూర్ మండల శాఖ
కరీంనగర్ జిల్లా: ది రిపోర్టర్ టీవీ : గ్రామపంచాయతీ సిబ్బంది కార్మికుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ మానకొండూర్ ఎంపీడీవో కార్యాలయం ముందు ఏడు రోజులుగా నిరవధిక సమ్మె నిర్వహిస్తుండగా బుధవారం బిజెపి మండల అధ్యక్షులు రాపాక ప్రవీణ్ ఆధ్వర్యంలో సమ్మెకు మద్దతు తెలిపి సంఘీభావం ప్రకటించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశిస్తూ బిజెపి మానకొండూరు అసెంబ్లీ నియోజకవర్గం ఇంచార్జ్ గడ్డం నాగరాజు మరియు బిజెపి జిల్లా కార్యదర్శి రంగు భాస్కరాచారి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గ్రామపంచాయతీలో పనిచేస్తున్న కారోబార్, బిల్ కలెక్టర్, స్విపర్స్, ఎలక్ట్రీషియన్స్, వాటర్ మెన్, డ్రైవర్స్ తదితరుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని అన్నారు. గ్రామపంచాయతీ సిబ్బందిని వెంటనే పర్మినెంట్ చేయాలి, స్వీపర్లకు 15,600/- బిల్ కలెక్టర్లకు, కారోబార్లకు 19500/- కంప్యూటర్ ఆపరేటర్లకు 22570/- వేతనంగా నిర్ణయించాలి. ఈ రాష్ట్ర ప్రభుత్వం గ్రామపంచాయతీ సిబ్బందికి ప్రత్యేక గ్రాంట్ ద్వారా జీతాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. తమ న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని లేదంటే రాబోయే రోజుల్లో గ్రామపంచాయతీ సిబ్బందికి భారతీయ జనతా పార్టీ పూర్తి మద్దతు ఉంటుందని అన్నారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం గ్రామపంచాయతీ సిబ్బందిపై చిన్న చూపు చూస్తుందని వాళ్లకు ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా కార్యవర్గ సభ్యులు అప్పాని తిరుపతి, ఓబీసీ మోర్చ జిల్లా ఉపాధ్యక్షులు మియాపురం లక్ష్మణచారి, మండల ఉపాధ్యక్షులు కత్తి ప్రభాకర్ గౌడ్, ఎస్సీ మోర్చ మండల అధ్యక్షులు ఆరేల్లి శ్రీహరి, ఓబీసీ మోర్చా మండల అధ్యక్షులు మార్కొండ రమేష్ పటేల్, బీజేవైఎం మండల అధ్యక్షులు భాషాబోయిన ప్రదీప్ యాదవ్, బీజేవైఎం మండల ఉపాధ్యక్షులు కొండ్ర వరప్రసాద్, గ్రామపంచాయతీ సిబ్బంది కార్మిక సిబ్బంది యూనియన్ సభ్యులు పాల్గొన్నారు.