లాభాల్లో ఉన్న విశాఖ స్టీల్ ప్లాంట్ ని ఎందుకు ప్రైవేటీకరణ చెయ్యాలని ప్రశ్నించిన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ సబబు కాదని మన జేడీ లక్ష్మీనారాయణ గారు హైకోర్టు లో పిల్ వేసిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ రోజు విచారణలో భాగంగా మన జేడీ గారు మరియు సీనియర్ లాయర్ ఆది నారాయణరావు గారు హైకోర్టుకి హాజరు అవ్వడం జరిగింది.లాయర్ అది నారాయణరావు గారి వాదనలు విన్న సిజేఐ గారు లాభాల్లో ఉన్న స్టీల్ ప్లాంట్ ని ఎందుకు ప్రైవేటీకరణ చెయ్యాలని ప్రశ్నించడంతో కేంద్ర ప్రభుత్వ లాయర్ 4 వారాలు వాయిదా కోరారు.