కరీంనగర్ జిల్లా : గన్నేరువరం మండలం : హైదరాబాదు లోని వనస్థలిపురం లో తలపెట్టిన ఎస్టీయూ 75 వ వసంతాల వజ్రోత్సవాలు వేడుకలను ఉపాధ్యాయులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని ఎస్టీయూ జిల్లా అధ్యక్షుడు కట్ట రవీంద్ర చారి పేర్కొన్నారు. మండల కేంద్రంలో 75 వసంతాల వజ్రోత్సవాల వేడుకల పోస్టర్ ను ఉపాధ్యాయులతో కలిసి ఆవిష్కరించారు, ఈ సందర్భంగా మాట్లాడుతూ 7:30 దశాబ్దాలుగా రాష్ట్ర ఉపాధ్యాయుల సంఘం ఉపాధ్యాయ విద్యారంగ సేవలో పునరింకితమయందని, ఉపాధ్యా పేస్కెట్లు, పి.అర్.సి అప్రెంటిస్ రద్దు లాంటి అనేక సౌకర్యాలు సాధించి పెట్టిందని 75 వసంతాలుగా ఉద్యమమే పోరాట తత్వంగా పనిచేసిన సంఘం ఎస్టీయూ అని కేవలం ఉపాధ్యాయు హక్కులు, ప్రయోజనాల కోసమే కాకుండా ప్రభుత్వ పాఠశాల పరిరక్షణ ద్వేయంగా ఎస్టీయూ పనిచేస్తుందన్నారు, సుదీర్ఘ చరిత్ర కలిగిన ఎస్టీయూ సంఘ 75 వసంతాల వేడుకల మహోత్తర ఘటంలో వేల సంఖ్యలో ఉపాధ్యాయులు హాజరుకావాలని వారు పిలుపునిచ్చారు, అనేకమంది మంత్రులు,అధికారులు, ప్రజాప్రతినిధులు, మేధావులు, హాజరవుతారని ఉపాధ్యాయ విద్యారంగా అభివృద్ధిపై సమగ్ర చర్చ ఉంటుందన్నారు.