సూర్యాపేట జిల్లా: బీసీ గురుకుల విద్యాలయంలో విద్యార్థిని సూసైడ్ కలకలం రేపింది. క్లాసు రూమ్‌లో ఫ్యాన్‌కి చున్నీ తో ఉరి వేసుకొని జిలోజు శివాని (14) ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్ పట్టణంలో మంగళవారం తెల్లవారుజామున జరిగింది.
మాహాత్మ జ్యోతిరావు పూలే బాలికల రెసిడెన్షియల్ పాఠశాల పాలకవీడు మండలం గుడుగుంట్ల పాలెం సంబంధించిన పాఠశాలను అక్కడ సరైన భవనం లేకపోవడంతో దానిని హుజూర్ నగర్‌లోని పాత గాయత్రి డిగ్రీ కళాశాలను ఒక భవనం అద్దెకి తీసుకొని నిర్వహిస్తున్నారు.
ఆ పాఠశాలలో చదువుతున్న విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడడంతో స్థానికంగా తీవ్ర ఆందోళన నెలకొంది.
పాఠశాల ప్రిన్సిపల్ అనిత ఆర్‌సిఓ షకీలా తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. నేరేడుచర్ల మండలం బక్కయ్య గూడెం గ్రామానికి చెందిన జె,శివాని 5వతరగతి నుండి ఇదే స్కూల్లో ప్రస్తుతం 9వ తరగతి చదువుతుంది. ఇటీవల కాలంలో కొంతమంది తన ఫ్రెండ్స్‌తో కలిసి రోడ్డు వెంట వెళ్లే వారికి హాయ్ బాయ్ చెబుతున్నారని తెలిపారు.
ఇలా చెప్పేవారిని ఆ క్లాసులో 8మంది విద్యార్థులుగా గుర్తించి టీచర్లు వారిని పద్ధతి మార్చుకోవాలని చెప్పారు. ఆయిన వారి ప్రవర్తనలో మార్పు రాకపోవడంతో సోమవారం వారి పేరెంట్స్‌ను పిలిపించి మీటింగ్ ఏర్పాటు చేసి ఆ విద్యార్థినులు చేస్తున్న ప్రవర్తనను తల్లిదండ్రులకు వివరించినట్లు తెలిపారు.
8మందిలో ఆరుగురు పేరెంట్స్ అటెండ్ అయ్యారని వివరించారు. ఒక విద్యార్థిని అంతకుముందే పండగ ఉందని ఇంటికి వెళ్లిపోయిందన్నారు. మిగతా ఏడుగురు విద్యార్థుల పేరెంట్స్ మీటింగ్‌కి శివాని పేరెంట్స్ తప్ప అందరూ హాజరయ్యారని తెలిపారు.
ఈ విషయాన్ని విద్యార్థుల పేరెంట్స్‌కు చెప్పి నాలుగు రోజులుగడిచింది ఇంటికి తీసుకువెళ్తే వారిలో మార్పుతో పాటు వాళ్ల పద్ధతి మారుతుందని ఆశించి ఇంటికి పంపించామని తెలిపారు. ఈ పేరెంట్స్ మీటింగ్‌కి శివాని పేరెంట్స్‌కి సమాచారం అందించామని కానీ వారు అందుబాటులో లేకపోవడంతో రాలేదని తెలిపారు.
మంగళవారం వస్తామని తమకు సమాచారం ఇచ్చారన్నారు. ఈ క్రమంలో ఈ రోజు తెల్లవారుజామున క్లాస్ రూమ్‌లో ఫ్యాన్ కి ఉరివేసుకొని విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడిందని ఆమె వివరించారు.
నైట్ కేర్ టీచర్‌గా ఉన్న భరణి గుర్తించి సమాచారం అందించిందని తెలిపారు. ఇది గుర్తించిన టీచర్ భరణి ప్రిన్సిపల్‌కు ఉన్నతాధికారులకు పోలీసులకు సమాచారం అందించింది.
ఆత్మహత్యకు పాల్పడి మృతి చెందిన విద్యార్థిని శివాని మృదేహాన్ని పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.