కరీంనగర్ జిల్లా: వీణవంక మండలం: అపురూపమైన ఆ రోజులెంతో అమూల్యమైనవి.. 48 వసంతాల వెనుక దాగిన ఆత్మీయత నేడు ఆహ్వానిస్తోంది. స్నేహపరిమళాలతో ఆనందంగా… పసి ప్రాయపు జీవన ఉషోదయపు వాకిళ్ళలో జ్ఞాన బీజాలెన్నో చల్లుతూ అక్షరాల ఆలింగనంతో నిత్యం ప్రకాశించే ఈ జ్యోతులకు కుసుమ వందనాలు. చిన్ననాటి స్నేహితులు.. ఒకేచోట చదువుకుని పదో తరగతి పూర్తయ్యాక కొంత మంది ఉద్యోగాల్లో స్థిరపడగా, మరికొంత మంది వ్యాపారం, ఇతర రంగాల్లో కొనసాగుతున్నారు. వీణవంక మండల ప్రాథమికొన్నత పాఠశాలలో పూర్వ విద్యార్థులు 1975- 1976 పదవ తరగతి పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఆదివారం వీణవంక లో ఘనంగా జరుపుకున్నారు. ఆత్మీయ పలకరింపులు, ఆలింగనాల నడుమ నాటి మధుర స్మృతులను నెమరేసుకున్నారు. తమకు విద్యాబుద్ధులు చెప్పిన నాటి గురువులను పూర్వ విద్యార్థులు శాలువాలతో ఘనంగా సన్మానించారు. అనంతరం పూర్వ విద్యార్థులు అందరూ ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకున్నారు. వివిధ వృత్తులలో ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగాలలో స్థిరపడిన పూర్వ విద్యార్థులు తాము చదువుకున్న పాఠశాలలో కలసి తిరిగి తమ అనుబంధాలను స్మరించుకున్నారు. తమ విద్య, వైవాహిక, ఉద్యోగ జీవిత విశేషాలు కుటుంబ నేపథ్యాల విషయాల గురించి ఒకరికొకరు తమపిల్లలు చదువుల గురించి వివరాలు చెప్పుకుంటు ఎంతో ఆనందోత్సాహాలతో గడిపారు. అనంతరం తోటి విద్యార్థి గత రెండు రోజుల క్రితం అనారోగ్యంతో మృతి చెందగా ఆ కుటుంబానికి 20 వేల రూపాయల ఆర్థిక సాయం అందజేశారు, ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, కే.మాధవరెడ్డి, గంగాడి లింగారెడ్డి, శ్రీనివాస్, పూర్వ విద్యార్థులు మహాకళ రామ్ గోపాల్ రెడ్డి, మాడ మల్లారెడ్డి, యల్ల సుధాకర్ రెడ్డి ,జయప్రద, చూడమని, సంపత్ కుమార్, లింగారెడ్డి, నారాయణరెడ్డి, గోవిందరెడ్డి, లక్ష్మారెడ్డి, బండారి రాజయ్య, జగదీశ్వర్, జయప్రకాష్, సురో శ్రీనివాస్, కనకయ్య ,ప్రసాద్
పాల్గొన్నారు.
