దేశ వ్యాప్తంగా హోలీ సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి. యువత ఒకరిపై ఒకరు రంగులు పూసుకుంటూ రంగుల పండుగ హోలీని ఆనందోత్సాహాలతో జరుపుకుంటున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ పండుగ జోరుగా జరుగుతోంది. ఈ సందర్బనగా ప్రింట్ & ఎలక్ట్రానిక్ మీడియా రిపోర్టర్స్ అసోసియేషన్ జాతీయ అధ్యక్షులు తెలుగు ప్రజలకు ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా హోలీ శుభాకాంక్షలు తెలిపారు.
“సప్తవర్ణ శోభితం.. సకల జనుల సంబురం.. ప్రజలందరికీ హోలీ శుభాకాంక్షలు” అంటూ సీఎం ట్వీట్ చేశారు. అలాగే ఈ రంగుల పండుగను అందరూ వైభవోపేతంగా జరుపుకోవాలని అన్నారు. ఈ పండుగ అందరీ కుటుంబాల్లో ఆనందాలు నింపాలని సీఎం రేవంత్ రెడ్డి ఆకాంక్షించారు.