- ప్రేమ ఒకరితో !
- పెళ్లి మరొకరు తోనా !
- ప్రేమించి మోసం చేసిన టిఆర్ఎస్ ఎంపీపీ తనయుడు
సంగారెడ్డి :యువతిని ప్రేమ పేరుతో పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఆరేళ్లుగా చనువుగా ఉంటూ వేరే అమ్మాయితో ఎంగేజ్ మెంట్ కు సిద్దమైన భారత రాష్ట్ర సమితి (బి ఆర్ ఎస్ ) మండల ప్రజా పరిషత్ ప్రతినిధి కుమారుడు. విషయం తెలిసిన పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నంకు గురువారం మధ్యాహ్నం ప్రయత్నించింది. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు బాధిత యువతిని పటాన్చెరువు లోని ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురంకు చెందిన వినూత్నేశ్వరీ అమీన్ పూర్ మండల ప్రజా పరిషత్ అధ్యక్షుడు ఈర్ల దేవానంద్ రెండో కుమారుడు ఈర్ల ప్రశాంత్ గత ఆరేళ్లుగా ప్రేమ వ్యవహారం కొనసాగించి పెండ్లి చేసుకుంటానని నమ్మబలికి ప్లేటు ఫిరాయించడంతో యువతి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన పటాన్‌చెరు లో చోటు చేసుకుంది. వినూత్నేశ్వరీ పటేల్ గూడలోని ఎల్లంకి కాలేజీలో బీటెక్ చదువుతుండగా వీరి ఇరువురి మధ్య ఏర్పడిన పరిచయం ప్రేమగా చిగురించి కొనసాగింది. ప్రేమించిన వ్యక్తి తనను కాదని వేరే అమ్మాయితో రేపు శుక్రవారం ఎంగేజ్ మెంట్ చేసుకుంటున్నాడని తెలిసి మనస్థాపానికి గురై జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్య ప్రయత్నం చేసుకోంధీ. బాధ్యత యువతి మీడియా ముందు పటాన్ చెరు ప్రభుత్వాస్పత్రిలో తనకు జరిగిన అన్యాయాన్ని వివరించింది . విషయం తెలుసుకున్న ఎంపీపీ దేవానంద్ కుటుంబ సభ్యులతో కలిసి యువతి వద్దకు వచ్చి బేరసారాలకు దిగారు. చేసుకుంటే ప్రేమించిన ప్రశాంత్ నే పెండ్లి చేసుకుంటానని లేదంటే చచ్చిపోతానంటూ హెచ్చరించింది. దీంతో పోలీసులు అధికార బిఆర్ఎస్ పార్టీకి చెందిన ఎంపీపీ కొడుకును కాపాడే ప్రయత్నంలో పోలీసులు బాధిత యువతి పై ఒత్తిడి తీసుకు వస్తున్నట్లు తెలిసింది.