తిరుపతి జిల్లా సూళ్లూరుపేట: మాంబట్టు లోని భారతి కంపెనీకి వెళ్తున్న కార్మికుల ఆటోను సూళ్లూరుపేట వైపు వస్తున్న లారీ లారీ అతివేగంతో ఢీకొనడంతో ప్రమాదం జరిగినది తెలుస్తుంది. ఈ ప్రమాదంలో ఆటో డ్రైవర్ రోడ్డుపై పడిపోవడంతో వెనుక నుంచి వచ్చిన మరో లారీ ఆటో డ్రైవర్ పైన నుంచి వెళ్ళినట్టు తెలుస్తుంది. ఈ ఘటనలో ఆటో డ్రైవర్ అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. ఆటోల ప్రయాణిస్తున్న 7 మందికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం సూళ్లూరుపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.
