ప్రస్తుతం బంగాళాఖాతంలో విశాఖకి తూర్పుగా అథికపీడన ప్రాంతం కొనసాగుతోంది. దీని వలన పొడిగాలుల తీవ్రత పెరిగి రానున్న మూడు రోజుల వ్యవధిలో మధ్య ఆంధ్రా ప్రాంతం అయిన ఎన్.టీ.ఆర్. (విజయవాడ వైపు), గుంటూరు, ఏలూరు, తూర్పు।పశ్చిమ గోదావరి, అనకాపల్లి, విజయనగరం, శ్రీకాకుళం, ప్రకాశం పశ్చిమ భాగాలు, నెల్లూరు, తిరుపతి, అన్నమయ్య, కడప, కర్నూలు, నంధ్యాల, చిత్తూరు జిల్లాల్లో వేడి 44-45 డిగ్రీల వరకు పలు భాగాల్లో నమోదవ్వనుంది. అనంతపురం, సత్యసాయి జిల్లాల్లో వేడి 40 వరకు ఉండనుంది. అలాగే కృష్ణా, కొనసీమ, బాపట్ల, కాకినాడ జిల్లాల్లో 36 నుంచి 39 డిగ్రీల మధ్యలోనే వేడి కొనసాగుతుంది.
విశాఖ నగరంలో కూడ ఉష్ణోగ్రతలు 36 డిగ్రీల వరకు ఉండనుంది. వేడి తీవ్రత మరో మూడు రోజుల వరకు కొనసాగనుంది.