అనంతపూర్ జిల్లా గుత్తి : నేడు కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య గారి 38వ వర్ధంతి సందర్బంగా అనంతపురం జిల్లా గుత్తి పట్టణం జడ్ వీరారెడ్డి కాలనీ లో సుందరయ్య గారి వర్ధంతిని జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా కార్యవర్గ సభ్యురాలు వి సావిత్రమ్మ హాజరయ్యారు. సమావేశంలో ఆమె మాట్లాడుతూ 1964 నుంచి 1976 వరకు కామ్రేడ్ సుందరయ్య గారు సిపిఎం ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహించిన 12 ఏళ్ల కాలంలో ఈ లక్ష సాధనకే ఆయన కృషి చేశారు సరైన మార్క్సిస్టు, లేననిస్టు మూల సూత్రాల ప్రాతిపదికన అలాంటి పార్టీ నిర్మాణం కోసం మనం సుందరయ్య వారసత్వాన్ని ముందుకు తీసుకోబోవాలి అని ఆయన అన్నారు. మన దేశ కమ్యూనిస్టు ఉద్యమ ప్రసిద్ధి నేతల్లో కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య గారు ఒకరని ప్రస్తావించారు. ఉద్యమానికి ఆయన అనేక సేవాలు అందించిన నాయకుడు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు సిపిఎం జిల్లా కమిటీ సభ్యురాలు వి నిర్మల, మండల కార్యదర్శి రామకృష్ణ , సిపిఎం మండల కమిటీ సభ్యులు మల్లికార్జున, రేణుక ,మున్నీ తదితరులు పాల్గొన్నారు