హైదరాబాద్ – మధురానగర్ లో సుపారీ కిల్లర్స్ హల్ చల్ చేసారు. మధురానగర్ నాయుడు టీ స్టాల్ వద్ద సాయి అనే వ్యక్తి పై ఇద్దరు వ్యక్తులు దాడి చేశారు. అనంతరం మద్యం బాటిల్ తో తల పగులగొట్టి , కత్తి తో దాడికి యత్నించగా కాలనీ వాసులు సాయి ని కాపాడి, ఒక వ్యక్తిని పట్టుకొని పోలీసులకు అప్పగించారు. మరో వ్యక్తి పరారీలో ఉన్నాడు. పోలీసుల అదుపులో ఉన్న వ్యక్తి పేరు మియాపూర్ కి చెందిన ప్రశాంత్ గా తెలిసింది. సాయి అనే వ్యక్తిని చంపడానికి సుపారీ తీసుకున్నట్టు విశ్వనీయ సమాచారం. స్థానికులు సాయి ని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన పై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.