విద్వేషపూరిత వ్యాఖ్యలపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. దేశ వ్యాప్తంగా నమోదవుతున్న విద్వేష ప్రసంగాలపై పని చేయడానికి ఒక కమిటీని ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. విద్వేషపూరితమైన వ్యాఖ్యలను నియంత్రించేలా కేంద్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ షహీన్ అబ్దుల్లా అనే వ్యక్తి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ ను విచారించిన సుప్రీంకోర్టు… ఒక కమిటీని ఏర్పాటు చేయాలని ఆదేశించింది. దేశంలో మత సామరస్యం ఉండాల్సిన అవసరం ఉందని సుప్రీం ధర్మాసనం చెప్పింది. విద్వేషాలకు అన్ని కమ్యూనిటీలు బాధ్యులేనని తెలిపింది.