న్యూఢిల్లీ: ఏపీ రాజధాని అమరావతి (AP Capital amaravati)పై దాఖలైన పిటిషన్‌లపై సుప్రీం కోర్టు (Supreme court)లో విచారణ ప్రారంభమైంది. మంగళవారం సీజేఐ జస్టిస్ యుయు లలిత్ (UU Lalith) నేతృత్వంలోని ప్రత్యేక ధర్మాసనం విచారణ చేపట్టింది.అమరావతిని రాజధానిగా కొనసాగించేలా తగిన ఆదేశాలు ఇవ్వాలని ఉన్నతన్యాయస్థానంలో పలువురు రైతులు పిటిషన్ దాఖలు చేశారు. ఇదే వ్యవహారానికి సంబంధించి హైకోర్టు (Highcourt) తీర్పుపై స్టే ఇవ్వాలని సుప్రీంకోర్టును ఏపీ ప్రభుత్వం (AP Government) ఆశ్రయించింది. రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ ఇప్పటికీ రిజిస్ట్రీలో డిఫెక్ట్స్‌లో ఉండగా… పలువురు రైతులు దాఖలు చేసిన పిటిషన్‌పై సీజేఐ జస్టిస్ యుయు లలిత్, అజయ్ రాస్తోగి, రవీంద్ర భట్ ధర్మాసనం విచారణ జరుపుతోంది.