న్యూఢిల్లీ: నిందులకు నోటీసులు పంపే విషయంలో సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. నిందుతులకు వాట్సాప్‌లో నోటీసులు పంపొద్దని తేల్చి చెప్పింది. వాట్సాప్, ఇతర ఎలక్ట్రానిక్ పద్ధతుల్లో నిందితులకు నోటీసులు పంపించడం చట్ట ప్రకారం కుదరదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. చట్ట ప్రకారం నోటీసులు నేరుగా వ్యక్తులకు అందివ్వాలని తెలిపింది. పోలీసులు నిందితులకు వాట్సాప్‌లో నోటీసులు పంపుతున్న విషయాన్ని సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ లూత్రా కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. వాట్సాప్, ఈ-మెయిల్, ఎస్‌ఎంఎస్ ద్వారా నోటీసులు పంపించవచ్చని హర్యానా డీజీపీ పోలీసులకు ఉత్తర్వులు ఇచ్చిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు. దీనిపై స్పందించిన ధర్మాసనం ఎలక్ట్రానిక్ పద్ధతిలో నోటీసులు పంపొద్దని కేంద్రం, రాష్ట్రాలకు కీలక ఆదేశాలు జారీ చేసింది.