contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

సురభి లేబరేటరీ వద్ద ధర్నా … రాస్తా రోకో

సంగారెడ్డి హత్నూర మండలం: కాలుష్య పరిశ్రమ మాకొద్దు సురభి లాబరేటి పరిశ్రమ వద్ద చుట్టుపక్కల గ్రామస్తుల ధర్నా, రాస్తారోక నిర్వహించారు. వివరాల్లోకి తేలితే హత్నూర మండల పరిధిలోని వడ్డేపల్లి గ్రామ శివారులో గల సర్వే నంబర్ 529 ఏ ఏ బై వన్ లో ఐదు ఎకరాల భూమిలో నిర్మించబోయే సురభి లాబరేటరీ కాలుష్య పరిశ్రమ కాబట్టి నిర్మాణాన్ని వెంటనే ఆపివేయాలని వడ్డేపల్లి సాదుల నగర్ కోనంపేట్ తుర్కళ్ ఖానాపూర్ తదితర గ్రామాల ప్రజలు ఆదివారం నాడు ధర్నా, రాస్తారోక నిర్వహించారు. ఈ ధర్నాలో పాల్గొన్న టిపిసిసి రాష్ట్ర అధికార ప్రతినిధి ఆంజనేయులు గౌడ్ మాట్లాడుతూ ఈ పరిశ్రమ ఏర్పాటు అయితే సుమారు 5000 ఎకరాల వ్యవసాయ భూములు అదేవిధంగా తాగునీరు కలుషితమై ప్రజలకు అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుందని ఆయన అన్నారు. కాబట్టి ఈ పరిశ్రమను 10 రోజులలో తొలగించకపోతే వారిని ఎక్కడ ఉంటే అక్కడ అడ్డుకుంటామని ఆయన హెచ్చరించారు. స్త్రీల గర్భసంచుల సమస్యలు, అనారోగ్య సమస్యలు ఎన్నో రకరకాలుగా ఇబ్బందులు పడవలసి వస్తుందని ఆయన అన్నారు. స్థానిక ఎమ్మెల్యే మదన్ రెడ్డి చొరవ తీసుకొని వెంటనే ఈ పరిశ్రమ రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు చర్యలు తీసుకొని ఈ పరిశ్రమ తొలగించే విధంగా చూడాలని లేని యడల పోరాటం ఉదృతం చేస్తామని హెచ్చెరిచారు. ఈ ధర్నా కార్యక్రమంలో అఖిలపక్ష నాయకులు ప్రజా ప్రతినిధులు వడ్డేపల్లి సాదుల నగర్ కోనంపేట పక్కల గ్రామస్తులు రైతులు ప్రజా ప్రతినిధులు ప్రజలు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

 Don't Miss this News !

Share :