కరీంనగర్ జిల్లా: మావోయిస్టు డిసియంగా పనిచేసి కరీంనగర్ సిపి ముందు ఇటీవల లొంగిపోయిన రాజన్న సిరిసిల్లా జిల్లా కోనరావుపేట మండలం శివంగులపల్లికి చెందిన నేరేళ్ళ జ్యోతి అలియాస్ జ్యోతక్క (35)కు కరీంనగర్ పోలీస్ కమీషనర్ ఎల్ సుబ్బరాయుడు 5లక్షల రూపాయల ఆర్థిక సహాయం చెక్కును శుక్రవారం నాడు తన కార్యాలయంలో అందజేశారు.
