తిరుపతి: ఎస్వీ ప్రాణదాన ట్రస్టుకు శనివారం ఒక కోటి రూపాయలు విరాళంగా అందింది. హైదరాబాదుకు చెందిన ఎస్ఆర్సీ ఇన్‌ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ తరపున ఎవికె.ప్రసాద్, ఎవి ఆంజనేయ ప్రసాద్ విరాళం డిడిని శనివారం తిరుమలలోని ఛైర్మన్ క్యాంపు కార్యాలయంలో టిటిడి ఛైర్మన్ వైవి సుబ్బారెడ్డికి అందజేశారు. టిటిడి బోర్డు సభ్యుడు సనత్ కుమార్ పాల్గొన్నారు.
