గణాలకు అధిపతి అయిన ప్రథమ దేవుడు వినాయకుడిని పూజించే వినాయక చవితి పర్వదినం హిందువులకు ఎంతో పవిత్రమైనదని ప్రింట్ & ఎలక్ట్రానిక్ మీడియా రిపోర్టర్స్ అసోసియేషన్ జాతీయ సభ్యులు వి.శ్యాంప్రసాద్ అన్నారు. శాంతి, సౌభ్రాతృత్వం వెల్లివిరిసేలా ఆధ్యాత్మిక సాంసృతిక కార్యక్రమాలలో భక్తి శ్రద్ధలతో పాల్గొంటూ ప్రజలందరూ ఐకమత్యంతో, ఆనందంతో గణపతి నవరాత్రులను జరుపుకోవాలని శ్యాంప్రసాద్ సూచించారు. రాష్ట్ర ప్రజలు సుఖశాంతులతో ఆనందంగా ఉండేలా దీవెనలు అందివ్వాలని విఘ్నేశ్వరుని ప్రార్థించారు. నవరాత్రులతోపాటు, నిమజ్జనం సందర్భంగా ప్రజలందరికీ ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా రాష్ట్ర ప్రభుత్వాలు పటిష్టమైన చర్యలు చేపట్టాలని కోరారు.