- T SAVE లోగో ఆవిష్కరించిన వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ నిజామాబాద్ అర్బన్ ఇంచార్జ్ బుస్సాపూర్ శంకర్
నిజామాబాద్ అర్బన్ లో జ్యోతి రావు ఫూలే జయంతి సందర్భంగా నిజామాబాద్ నగరంలోని ఆయన విగ్రహానికి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ నిజమాబాద్ అర్బన్ ఇంచార్జ్ బుస్సాపూర్ శంకర్ పార్టీ నేతలతో కలిసి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
అనంతరం ఆయన విగ్రహం వద్ద , నిరుద్యోగుల పక్షాన రాజకీయాలకు అతీతంగా వై ఎస్ షర్మిల గారు ఏర్పాటు చేసిన T SAVE లోగోను వివిధ పార్టీల ప్రతినిధులు మరియు వివిధ సంఘాల నాయకులతో కలిసి ఆవిష్కరించారు . ఈ సందర్భంగా బుస్సాపుర్ శంకర్ గారు మాట్లాడుతూ నిరుద్యోగులు కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో కేసీఆర్ కుటుంబానికి మాత్రమే ఉద్యోగాలు దక్కాయి అని , నిరుద్యోగుల మరియు విద్యార్థుల భవిష్యత్తు మన రాజకీయ బాధ్యత మాత్రమే కాదు మన నైతిక బాధ్యత కూడా అని అన్నారు
T-SAVE పోరాటానికి మద్దతు తెలిపిన తెలుగుదేశం పార్టీ , బహుజన్ సమాజ్ పార్టీ సహా వివిధ పార్టీల నాయకులకు , ప్రజా, సంఘాల నేతలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
నిరుద్యోగులు, విద్యార్థుల కోసం రాజకీయాలకు అతీతంగా కలిసి పోరాడుదాం అని తొమ్మిదేండ్లుగా నిరుద్యోగులకు జరుగుతున్న అన్యాయంపై, ప్రభుత్వ మోసాలపై గళం వినిపించుదాం అని , పూర్తి స్థాయిలో ఉద్యోగాల భర్తీ కోసం సర్కారుపై ఒత్తిడి తీసుకొద్దాం అని అన్నారు
ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ పార్లమెంటు అధ్యక్షులు దేగం యదగౌడ్ గారు , బహుహన సమాజ్ పార్టీ నిజమాబాద్ ఇంచార్జ్ నీరడీ లక్ష్మణ్ గారు , సీనియర్ నాయకులు వినోద్ కుమార్ , లక్ష్మణ్ , శంకర్ , రవి , వైఎస్ఆర్టీపి జిల్లా యువజన విభగం అద్యక్షులు అంకార్ గణేష్ , నగర యువజన అధ్యక్షులు సంతోష్ , సాగర్ , మహిళ నేతలు రేఖ , రాణి తదితరులు పాల్గొన్నారు