సిద్దిపేట జిల్లా: ది రిపోర్టర్ టీవీ : బెజ్జంకి మండలం నూతన తహసీల్దార్ గ కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండల తహసీల్దార్ నల్ల వెంకటరెడ్డి బదిలీపై బెజ్జంకి మండల తహసీల్దార్ గ శుక్రవారం పదవీ బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మండలంలోని అన్ని శాఖలను సమన్వయం చేసుకుంటూ ప్రజలకు అందుబాటులో ఉంటానని పేర్కొన్నారు. అలాగే ఇంతకాలం బెజ్జంకి తహసీల్దార్ గా పనిచేసిన విజయ్ ప్రకాష్ రావు రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలానికి బదిలీపై వెళ్లారు.
