భర్త నాటిన చెట్టును భర్త రూపంగా భావించి భర్త బర్త్ డే రోజున ఆ చెట్టు దగ్గరికి వెళ్లి అందరిని పిలిచి బర్త్ డే వేడుకలు జరుపుకుంటున్నారు తాండూరు కు చెందిన మున్సిపల్ మాజీ చైర్పర్సన్ విజయలక్ష్మి . అవును మీరు వింటున్నది నిజమే. వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణానికి చెందిన మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ కోట్రికావిజయలక్ష్మి తన భర్త కోట్రికా వెంకటయ్య భార్య భర్తలు ఇద్దరు తన ఇంటి ముందు ఓ చెట్టును నాటారు. భర్త వెంకటయ్య చనిపోయిన తర్వాత. ఆయన
జ్ఞాపకార్థకంగా భర్త పుట్టినరోజును చెట్టు తో జరుపుకుంటుంది. సోమవారం జులై 29వ తేదీన తన భర్త పుట్టినరోజు ఉండడం తో తాండూరు వ్యవసాయ పరిశోధన క్షేత్రంలో ఈ వేడుకలు విజయలక్ష్మి తన స్నేహితులను పిలిచి జరుపుకున్నారు. చెట్టుకు ప్రత్యేకంగా బెలూన్స్ కట్టి, చెట్టుకు ఫొటో పెట్టి,బ్రేజర్ ను వేసి, ఫలహారాలు, స్వీట్ అన్ని పెట్టి పూజించి ప్రతి సంవత్సరం జరుపుకుంటుంది. ఈ సందర్భంగా కోట్రిక విజయలక్ష్మి మాట్లాడుతూ తన భర్త కోట్రిక వెంకటయ్య పుట్టినరోజు ఆగస్టు 29వ తేదీన అయితే ప్రతి సంవత్సరం మేము పుట్టిన రోజు వేడుకలను కుటుంబ సభ్యులతో జరుపుకునే వారిమని అన్నారు. అనారోగ్య కారణంగా అకారణంగా తన భర్త మరణించడం జరిగింది. అయితే భర్త వెంకటయ్య మరణించ ముందు విజయలక్ష్మి వెంకటయ్య ఇద్దరూ వెంకటయ్య బర్తే రోజు ఓ మొక్కను తన ఇంటి ముందు నాటారు, ఆ మొక్క నాటి నేటికి 8 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఆ మొక్కను ప్రతి సంవత్సరం తన భర్త జ్ఞాపకార్థంగా మొక్కను రక్షణ కల్పించడం తో చెట్టుగా మారింది. ఆ చెట్టు కూడా రోడ్డు విస్తరణలో వెళ్తుందని భయంతో భర్త విజయలక్ష్మి ఆ చెట్టును కోన వేరు నుండి తీసితాండూరు వ్యవసాయ పరిశోధన కేంద్రంలో మళ్లీ చెట్టును నాటారు .దీంతో ఆ చెట్టు నేడు మరింతగా చిగురించి పచ్చగా పెద్ద చెట్టు గా మారింది. ఈ 29వ తేదీన ఆ చెట్టుకు బెలూన్ లను కట్టి బర్తడే వేడుకలను జరిపారు.
ఇలా ప్రతి ఒక్కరు తమ జ్ఞాపకార్థంగా చెట్టును నాటితే ప్రకృతి లో పర్యావరణ పరిరక్షణగా మారుతుందని అన్నారు. ఈ వన మహోత్సవంలో అందరూ తమ జ్ఞాపకార్థంగా ఒక చెట్టును నాటాలని పిలుపునిచ్చారు. అంతకుముందు. ఈ వేడుకలకు వచ్చిన స్థానికులకు కూడా అన్నదానం చేశారు. ఈ సందర్భంగా అక్కడికి వచ్చిన వారందరూ కూడా చెట్టును చూసి సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాస్త్రవేత్త డాక్టర్ సుధాకర్, మరియు మహిళలు మంకాల సరిత,శంకరమ్మ, విజయలక్ష్మి కుటుంబ సభ్యులు తదితరులున్నారు.