మదనపల్లి :ఆంధ్రప్రదేశ్ మంత్రి కొల్లు రవీంద్ర ని రాజంపేట పార్లమెంట్ బెస్త సాధికార కమిటీ అధ్యక్షులు ముంబై దుర్గా బుధవారం విజయవాడలోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించారు. జిల్లాలోని రాజకీయాలపై మరియు బెస్త కులస్తుల సమస్యలపై మంత్రి అడిగి తెలుసుకున్నారు. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో ప్రతి పేదవారికి, బిసి కులస్తులకి పెద్దపీట వేసి వారి యొక్క అభివృద్ధికి తప్పకుండా సహకారం అందుతుందని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. త్వరలోనే అన్నమయ్య జిల్లాలో పర్యటిస్తానని అప్పుడు తప్పకుండా కలవాలని ముంబై దుర్గాని కోరారు . ఈ కార్యక్రమంలో తాడేపల్లి క్రిస్టియన్ పేట దాస్ తదితరులు పాల్గొన్నారు.
