మదనపల్లి : మైనార్టీ వర్గానికి చెందిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు అన్వర్ భాషా కి ప్రమాదవుశాత్తు కాలు కోల్పోవడంతో ఆయన పార్టీకి చేసిన సేవలను, నిబద్దతను గుర్తించి టీడీపీ పార్టీకి చెందిన NRI లోకేష్ 25000 రూపాయల ఆర్ధిక సహాయం చేశారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ.. తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి నాయకులు కార్యకర్తలు ఓకే కుటుంబానికి చెందిన సభ్యులుగా భావిస్తామని ఇందులో ఏ ఒక్క కార్యకర్తకి ఆపద వచ్చినా ఒకరికొకరు అండగా నిలుస్తామని ఆ సాంప్రదాయం ఒక్క తెలుగుదేశం పార్టీలో ఉంటుందని అన్నారు. అనంతరం రాజంపేట పార్లమెంటరీ టిడిపి అధికార ప్రతినిధి ఆర్జె వెంకటేష్ మాట్లాడుతూ… ఎన్టీ రామారావు టిడిపి పార్టీ స్థాపించినప్పటి నుంచి అన్వర్ భాష పార్టీలో కష్టపడుతూ పని చేస్తున్నారని అలాంటి వ్యక్తి ప్రమాదవశాత్తు కాలు కోల్పోవడం బాధాకరమైన విషయమని అన్నారు. ఏదేమైనాప్పటికీ పార్టీ నాయకులు కావచ్చు పార్టీ కావచ్చు ఎల్లవేళలా ఆయనకి చేదోడు వాదోడుగా నిలుస్తామని హామీ ఇచ్చారు. అనంతరం యువ నాయకులు కంచర్ల చింటూ మాట్లాడుతూ… ఎన్ని కష్టాలు వచ్చినా నమ్ముకున్న పార్టీని సిద్ధాంతాన్ని వదలకుండా పనిచేయడం అంటే ఒక గొప్ప విషయమని అలాంటి వ్యక్తికి రాజ వెంకటేష్ నేతృత్వంలో ఎన్నారై లోకేష్ అండగా నిలవడం కార్యకర్తల పట్ల ఉన్న నిర్బద్ధతకు నిదర్శనం అన్నారు. టిడిపి నాయకులు రాజేష్ మరియు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.