- నోరు అదుపులో పెట్టుకుంటే మంచిది
- లేదంటే మీ భూకబ్జాల బాగోతం వెలికి తీసి కటకటాల వెనక్కి పంపిస్తాం
- గుంతకల్లు వైఎస్ఆర్సిపి నాయకులపై విలేకరుల సమావేశంలో మండిపడ్డ గుత్తి టిడిపి ఇన్చార్జి గుమ్మనూరు నారాయణ
అనంతపురం జిల్లా,గుత్తి : దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి నాడు ఆయన చేసిన మంచి గురించి తలచుకోవాలి గానీ.. ఆయన తనయుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన మంచి ఏమైనా ఉంటే.. గుర్తు చేసుకోలే గాని టిడిపి నాయకులపై అవాకులు చవాకులు పేలితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి…నోరు అదుపులో పెట్టుకుంటే మంచిదని గుత్తి టిడిపి ఇన్చార్జి గుమ్మనూరు నారాయణ గుంతకల్లు వైఎస్ఆర్సిపి నాయకులను హెచ్చరించారు. సోమవారం గుత్తిలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. గుంతకల్లులో జరిగిన వైయస్ రాజశేఖర్ రెడ్డి జయంతి కార్యక్రమంలో వైసిపి గుంతకల్లు పట్టణ అధ్యక్షుడు సుంకప్ప టిడిపి నాయకులపై చేసిన వ్యాఖ్యలపై ఆయన ఈ సందర్భంగా ఘాటుగానే స్పందించారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా పోయిన వైసిపి అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి కిమ్మనకుండా ఊరకుంటే గుంతకల్లు వైసీపీ నాయకులు మాత్రం ఎగిరెగిరి పడుతున్నారని ఆయన వ్యాఖ్యానించారు. ప్రశాంతంగా ఉన్న గుంతకల్లు నియోజకవర్గంలో వైసీపీ నాయకులే ప్రశాంతతను భంగపరిచేటట్లు ఉన్నారని ఆరోపించారు. అసలు గత ఐదేళ్ల వైసిపి ప్రభుత్వ హయాంలో మాజీ నాయకులు, మాజీ వైసీపీ ఎమ్మెల్యే వెంకట్రామిరెడ్డి ప్రశాంతంగానే ఉన్నారు.. కానీ గుంతకల్లు నియోజకవర్గ ప్రజలు మాత్రమే చాలా ఇబ్బందులు పడ్డారని విచారం వ్యక్తం చేశారు. వైసిపి ప్రభుత్వం లో దోని ముక్కల రోడ్డు ఇతరత్రా ప్రాంతాల్లో ప్రభుత్వ స్థలాలను కబ్జా చేసి ఎంచక్కా వాటిని సొమ్ము చేసుకుని లక్షలాది రూపాయలు పోగు చేసుకున్నారని ఆరోపించారు. ప్రస్తుతం గుంతక