మదనపల్లి :రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ని మదనపల్లి నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షులు నాదెండ్ల అరుణ్ తేజ మర్యాదపూర్వకంగా కలిశారు. మంగళవారం మంత్రి కార్యాలయంలో నారా లోకేష్ ని కలిసి వైయస్ఆర్సీపీ ప్రభుత్వంలో తమ పైన పెట్టిన అక్రమ కేసులు గురించి ప్రస్తావించారు. మదనపల్లి నియోజకవర్గ అభివృద్ధి, ప్రజా సమస్యల పైన అరుణ్ తేజ మంత్రి లోకేష్ దృష్టికి తీసుకెళ్లారు. వైసిపి ప్రభుత్వంలో పెట్టిన ఆక్రమ కేసులు ఎత్తివేస్తూ, మదనపల్లి అభివృద్ధి పైన ప్రత్యేక దృష్టి సారిస్తానని లోకేష్ హామీ ఇచ్చినట్లు అరుణ్ తేజ తెలిపారు.