నిమ్మనపల్లి :మండలంలో ప్రజల సమస్యల పరిష్కారం కోసం అత్యధిక ప్రాధాన్యత ఇస్తామని దిగువ మాచి రెడ్డి గారి పల్లె బహిరంగ సమావేశం లో ఎమ్మెల్యే షాజహాన్ బాషా వెల్లడించారు.రాజంపేట పార్లమెంట్ అధికార ప్రతినిది అర్జె వెంకటేష్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా ఎమ్మెల్యే షాజహాన్ బాషా హాజరయ్యారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే కి ఆహ్వానం పలుకుతూ స్థానిక ఆలయం లో టిడిపి నాయకుడు నాగరాజు 101 టెంకాయలు కొట్టి దుశ్యాలువ, పుష్ప గుచ్ఛం, పూల మాల లతో ఘనంగా సన్మానించారు. అనంతరం జరిగిన బహిరంగ సభ లో ఎమ్మెల్యే మాట్లాడుతూ మండలం లో కాలువలు, రోడ్లు, మౌలిక సదు పాయాల కల్పన కృషి చేస్తామని ప్రకటించారు. ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వాన్ని నాయకులను ప్రజలు స్వాగతించాలని కోరారు. గ్రామాల్లో ప్రజలంతా ఐక్యంగా ఉండి ఆదర్శంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక శ్రద్ధ చూపడంతో పాటు గ్రామ పంచాయతీ నిధులు, 15 ఆర్థిక సంఘం నిధులు ద్వారా రోడ్లు, మురుగునీటి కాలువలు, తాగునీరు, పైపులైన్లు, వీధి దీపాలు, ఓవర్ హెడ్ ట్యాంకులు, అర్హులైన వారికి పెన్షన్లు, సంక్షేమ పథకాలు తోపాటు మౌలిక సదుపాయాల కల్పనకు పెద్దపీట వేస్తామన్నారు. మదనపల్లి నుండి నిమ్మనపల్లి డబ్బుల్ రోడ్డు పని పూర్తి చేస్తామని, వెంటనే ఈ మార్గం లో గోతులను పుడ్చడానికి చర్యలు చేపట్టాలని ఆర్ అండ్ బి అధికారులను ఆదేశించారు. గత ప్రభుత్వం అభివృద్ధి ని విస్మరించి, భూ ఖబ్జా లకు పాల్బడిందని ఆరోపించారు. నాయకులు అర్జె వెంకటేష్ మాట్లాడుతూ ఎమ్మెల్యే షాజహాన్ బాషా నేతృత్వంలో గ్రామాన్ని సమగ్రంగా అభివృద్ధి చేసుకుందామని పిలుపు నిచ్చారు.తనకు పిన్న వయసు లోనే ప్రజలు సర్పంచ్ గా అవకాశం ఇచ్చారని అప్పుడే గ్రామ పంచాయతీ భవనం నిర్మించడం జరిగిందని గుర్తు చేశారు. అయితే కొత్త కాలనీ ల్లో సౌకర్యాల కల్పనలో వెనుక బడ్డాయని, గ్రామాల్లో సిసి రోడ్లు, విద్యుత్ స్థంబాలు, కాలువలు, చెక్ డ్యామ్ మరమ్మత్తులు, చెరువు కాలువల మరమ్మత్తులు పూర్తి చేయాలని కోరారు. పలువురు నాయకులు మాట్లాడుతూ పార్టీ కోసం కష్ట పడి పనిచేసిన నాయకులు కు ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. గడిచిన ఐదేళ్లు కాలం లో జరిగిన అభివృద్ధి సూన్యం అన్నారు. ప్రజల అవసరాలు, సమస్య పై సంపూర్ణ అవగాహన కలిగిన వ్యక్తి షాజహాన్ బాషా ఎమ్మెల్యే గా రావడం ప్రజల అదృష్టమని పేర్కొన్నారు. స్థానిక సీనియర్ నాయకులు నాగరాజు మాట్లాడుతూ నియోజకవర్గం లో తెలుగు దేశం పార్టీ అధికారం లోకి రావడం, షాజహాన్ బాషా ఎమ్మెల్యే గా గెలచి నేడు తమ గ్రామానికి రావడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ స్థానిక గ్రామ దేవత కి టెంకాయలు కొట్టి, ప్రజలకు భోజనాలు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. అనంతరం ప్రజలనుండి ఎమ్మెల్యే అర్జీలను స్వీకరించి, వాటిని పరిష్కరించాలని ఆయా శాఖల అధికారుల ను ఆదేశించారు. ఈ కార్యక్రమం లో తహసీల్దార్ బాలాజీ రావు, ఎంపీడిఓ షాలేట్, ఏఓ రమేష్ బాబు, మండల కమిటీ అధ్యక్షులు రమణ, సీనియర్ నాయకులు రాజన్న, రెడ్డెప్ప రెడ్డి, రామకృష్ణ, శివకృష్ణ, మల్లికార్జున,ఉదయ్ కుమార్, శంకర, వీరభద్ర, రమణ బండ్లపై సర్పంచు లు లక్ష్మన్న,శ్రీపతి, సుబ్రహ్మణ్యం జనార్దన్ రెడ్డి, శేషాద్రి రెడ్డి, భాస్కర్, శ్రీనివాసులు రెడ్డి, మల్లికార్జున, నాయకులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.