పల్నాడు జిల్లా పెదకూరపాడు మండలంలోని కాశిపాడు గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ మండల సీనియర్ ఎస్సి నాయకుడు నీలం రత్నకుమార్ అకాల మృతి చెందగా పెదకూరపాడు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు అత్తిమళ్ళ రమేష్ మరియు జిల్లా తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి శుక్రవారం మృతుని కుటుంబానికి మట్టి ఖర్చులు నిమిత్తం ఐదు వేల రూపాయలు ఆర్థిక సహాయం అందించి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు ఈ కార్యక్రమంలో బెల్లంకొండ రాంగోపాల్ రావు గల్లా బాబురావు భాష్యం ఆంజనేయులు షేక్ అజిమల్ల పరుచూరి పూర్ణచంద్రరావు మండల ఎస్సీ సెల్ నాయకుడు జంగాల ప్రసాదు మరియు కాశిపాడు గ్రామం తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు