తిరుపతి : ఎక్కడ శవం ఉంటే అక్కడ జగన్మోహన్ రెడ్డి వచ్చి వాలిపోయి, చిరునవ్వులు చిందిస్తూ శవ రాజకీయాలు చేస్తున్నాడని. శవాలపైన చిల్లర ఏరుకునే వారి కన్నా దారుణంగా వ్యవహరిస్తున్నాడని. రాష్ట్రంలో ఉన్న ప్రతి శవానికి తానే బ్రాండ్ అంబాసిడర్ అనే విధంగా ప్రవర్తిస్తున్నాడని. అచ్యుతాపురంలో 15 మంది దాకా ప్రాణాలు కోల్పోయి తీవ్రమైనటువంటి బాధలో, దుఃఖంలో ఉంటే అక్కడికి వెళ్లి బాధితులకి అండగా ఉండడానికి కృషి చేయకుండా అక్కడ వెళ్లి తలలు నిమరటం, చిరునవ్వులు చిందించడం, ఫోటోలు ఫోజు ఇవ్వటం లాంటి శవ రాజకీయాలు చేస్తున్నాడని. రాష్ట్ర ప్రభుత్వం చనిపోయినటువంటి ప్రతి కుటుంబానికి ఒక కోటి రూపాయలు నష్టపరిహారం ఇవ్వడానికి , అదేవిధంగా గాయపడిన వారికి 50 లక్షలు మరియు 25 లక్షలు ప్రకటిస్తే… జగన్మోహన్ రెడ్డి ఫోటోలు కోసం ఫోజులిస్తూ శవ రాజకీయాలు చేస్తున్నాడని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ సప్తగిరి ప్రసాద్ అన్నారు. ఎక్కడ శవం ఉంటే అక్కడకు వచ్చి చిరునవ్వులు చిందించడం సర్వసాధారణమైపోయిందని. రాష్ట్ర ప్రజలు జగన్ ను చీదరించుకొని చిత్తుచిత్తుగా ఓడించినప్పటికీ కూడా వైసీపీ భజన బ్యాచి శవాల దగ్గర కూడా జై జగన్! అనే నినాదాలు చేయటం, సీఎం! సీఎం! అని నినాదాలు ఇప్పించుకోవటం జగన్మోహన్ రెడ్డి మూర్ఖత్వానికి కి నిదర్శనం అని టిడిపి నాయకులు ధ్వజమెత్తారు .ఈ మీడియా సమావేశంలో టిడిపి రాష్ట్ర బీసీ సెల్ అధికార ప్రతినిధి వెంకటేష్ యాదవ్, తవణంపల్లి మండల టిడిపి ప్రధాన కార్యదర్శి మధు యాదవ్, పూతలపట్టు నియోజకవర్గం బీసీ సెల్ అధ్యక్షుడు ధరణి ప్రకాష్, నియోజకవర్గం రైతు తెలుగు రైతు కార్యదర్శి బాబు నాయుడు పాల్గొన్నారు.