- శవాల మీద పేలాలు ఎరుకునే విధంగా జగన్మోహన్ రెడ్డి నీచ రాజకీయలు: ఆర్జే వెంకటేష్
మదనపల్లి : విజయవాడ విపత్తులో సిఎం చంద్రబాబునాయుడు 75 సంవత్సరాల వయస్సులో కూడా రాత్రి, పగలు కష్ట పడి సాధారణ పరిస్థితి లోకి తీసుకుని రావడానికి చేస్తున్న కృషిని యావత్ భారతదేశం అభినందిస్తుంటే, జీర్ణించుకొలేని మాజీ సిఎం జగన్మోహన్ రెడ్డి మాత్రం శవాల మీద పేలాలు ఏరుకునే విధంగా బురద రాజకీయలు చేస్తున్నారని తెలుగుదేశం పార్టీ రాజంపేట పార్లమెంటు అధికార ప్రతినిధి ఆర్జే వెంకటేష్ ఎద్దేవా చేశారు. మంగళవారం మదనపల్లిలోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జగన్మోహన్ రెడ్డి తీరుపై ముడిపడ్డారు. 123 సంవత్సరాల చరిత్రలో ఎన్నడూ లేని విధంగా విజయవాడలో ఓకే రోజు 27 సెంటీమీటర్ల వర్షం పడటం జరిగిందన్నారు. లోతట్టు ప్రాంతాలు జలమయం కావడంతో సుమారు రెండు లక్షల 60 వేల మందికి తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయని, ఈ దశలో సిఎం చంద్రబాబునాయుడు స్వయంగా రంగంలోకి దిగి పరిస్థితి చక్కదిద్దడానికి చర్యలు చేపట్టారన్నారు . మరో వైపు జగన్మోహన్ రెడ్డి బురద రాజకీయలు చేస్తుంటే సాక్షి దినపత్రిక మాత్రం రాజధాని అమరావతి పైన విషం చిమ్ముతూ అమరావతి మునిగిపోయింది, హైకోర్టు నీట మునిగిపోయిందని అసత్య ప్రచారం చేయడం దారుణం అన్నారు. జగన్మోహన్ రెడ్డి, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కష్టకాలంలో ఉన్న ప్రజలకు సాయం చేసే అవకాశం వున్న చేయకుండా విమర్శలు చేయడం పైన ప్రజలే అసహనం వ్వక్తం చేస్తున్నారని అన్నారు. ఇప్పటికైన రాజకీయలు మాని ప్రజలకు సాయం చేయడానికి జగన్మోహన్ రెడ్డి, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ముందుకు రావాలని సూచించారు.