మదనపల్లి :తిరుమల లడ్డూ కల్తీ వెనుక ఉన్న వైవీ సుబ్బారెడ్డి, కరుణాకర్రెడ్డిని వెంటనే అరెస్ట్ చేయాలి అని భక్తులు కోరుతునట్లు మదనపల్లి నియోజకవర్గ తెలుగుయువత అధ్యక్షులు నాదెండ్ల అరుణ్ తేజ తెలిపారు.తిరుమల లడ్డూ తయారీకి జంతువు కొవ్వు వాడింది నిజమని విజిలెన్స్ ప్రాథమికంగా ఇచ్చిన నివేదికలో తేలిందని తిరుమల లడ్డూ తయారీ కోసం గత 50 ఏళ్లుగా కర్ణాటకకు చెందిన కేఎంఎఫ్‌కి చెందిన నందిని నెయ్యిని వాడుతుండగా, జగన్ వచ్చి కేఎంఎఫ్ బదులు మరో తమిళనాడు కంపెనీకి కాంట్రాక్టు ఇచ్చాడన్నాడు. తాము ఇచ్చే నెయ్యి తక్కువకే ఇస్తున్నామని అంత కన్నా తక్కువ రేటుకు ఎవరైనా ఇస్తే తప్పనిసరిగా నాణ్యతా లోపం ఉన్నట్టే అని కేఎంఎఫ్ సంస్థ అధ్యక్షుడు బహిరంగ ప్రకటన కూడా చేశాడాన్నారు. అందుకు తగ్గట్టుగా జగన్ తెచ్చిన తమిళనాడు కంపెనీ నెయ్యికి బదులు జంతువుల కొవ్వును సరఫరా చేసిందనే ఆరోపణలు కూడా ఉన్నాయి అంటే జగన్ కావాలనే తిరుమల లడ్డూని అపవిత్రం చేసే కుట్ర చేసాడు అని స్పష్టంగా తెలుస్తుందని మండిపడ్డారు.