- టీడీపీ,జనసేన, బీజేపీ జెండాలతో హోరెత్తిన మాచర్ల పట్టణం
- హోరెత్తిన టీడీపీ జనసేన బీజేపీ శాసనసభ అభ్యర్థి జూలకంటి బ్రహ్మానంద రెడ్డి గ నామినేషన్ పర్వం….
పల్నాడు జిల్లా, మాచర్ల : ఏపీలో నామినేషన్ల పర్వం కొనసాగుతోంది.ఇప్పటికే పలువురు అభ్యర్థులు ఆయా నియోజకవర్గాల్లో నామినేషన్లు దాఖలు చేశారు. మాచర్ల అసెంబ్లీ అభ్యర్థిగా జూలకంటి బ్రహ్మారెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. భారీ జనసందోహంతో జూలకంటి ర్యాలీ కోలాహలంగా సాగింది. పచ్చ జెండాలతో మాచర్ల నిండిపోయింది. నామినేషన్ ర్యాలీ చూస్తే అధికారపక్షానికి దిమ్మతిరుగుతోంది. అధికార పక్షానికి ఓటమి భయం పట్టుకుందని కొందరు టిడిపి నాయకులు అంటున్నారు.
కార్యక్రమంలో పెద్ద ఎత్తునా జనసేన, టీడీపీ, బీజేపీ, నాయకులు మరియు కార్యకర్తలు పాలొన్నారు. సుమారు 50వేల మంది కి పైగా జూలకంటి బ్రహ్మానంద రెడ్డి మీద అభిమానం తో వచ్చిన ప్రజలు తో కిక్కిరిసిపోయింది మాచర్ల పట్టణం. ఎండని సైతం లెక్క చేయకుండా వచ్చిన జనానికానికి అభివందనం తెలిపారు జూలకంటి బ్రహ్మానంద రెడ్డి, చిరుమామిళ్ళ మధు బాబు.