- పెద్దిరెడ్డి ప్యాకప్…ఆఫ్రికాకు వాహనాల తరలింపు ద్వారా ప్రభుత్వం రాదనే సంకేతం
- సిఎస్ జవహర్ రెడ్డి ని సస్పెండ్ చేయాలి
- మాచర్ల, పుంగనూరు, తాడిపత్రి ఘటనలపై నిష్పక్షపాత విచారణ చేసి దోషాలను కఠినంగా శిక్షించాలి : టిడిపి రాజంపేట పార్లమెంటు అధికార ప్రతినిధి ఆర్‌జే వెంకటేష్ డిమాండ్
రాజంపేట: ప్రభుత్వం రాదని పెద్దిరెడ్డికి అర్దం అయిపోయిందని, ప్యాకప్ చెప్పి తన కంపెనీలకు చెందిన మొత్తం వాహనాలను ఆఫ్రికాకు తరలిస్తున్నాడని టిడిపి రాజంపేట పార్లమెంటు అధికార ప్రతినిధి ఆర్‌జే వెంకటేష్ ఆరోపించారు. గురువారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆర్‌జే వెంకటేష్ మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ప్రతిపక్షాలపై జరిగిన దాడులను అరికట్టడం విఫలం చెందిన సిఎస్ జవహర్ రెడ్డి ని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. మాచర్ల, తాడిపత్రి, పుంగనూరు తదితర ప్రాంతాలలో జరిగిన అల్లర్లపై విచారణ జరిపించి, దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. వైసిపి ప్రభుత్వానికి కొమ్ము కాస్తున్న సిఎస్ జవహర్ రెడ్డి ఎన్నికల సమయంలో జరిగిన ఘటనలను బహిర్గతం చేయకుండా తొక్కి పెట్టడం జరిగిందని ఆరోపించారు. వెబ్ కెమెరాల ద్వారా మానిటరింగ్ చేశామని చెప్పిన సిఎస్ రెండు రోజుల తరువాత కూడా అల్లర్లుకు సంబంధించిన విడియోలు బహిరంగం చేయకపోవడాన్ని తప్పు పట్టారు. ఎన్నికలు జరిగిన రోజు పుంగనూరు నియోజకవర్గంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుచరులు ఏజెంట్లను కిడ్నాప్ చేయడం, పొలింగ్ బూతులలో ఏజెంట్లను భయభ్రాంతులను గురిచేయడం జరిగిందని ఆరోపించారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి చెందిన పిఎల్ఆర్ కంపెనీ వాహనాలు అన్ని ఆఫ్రికాకు తరలించడం చిన్న, చిన్న కాంట్రాక్టర్లకు మంచి రోజులు వచ్చాయని అన్నారు. జిల్లాలో పెద్దిరెడ్డి చేసిన అరాచకాలు అన్ని, ఇన్ని కావు అన్నారు. గనులు, ఇసుక, మద్యం ఇలా అన్నింటా దోపిడీ చేసి ఎన్నికలలో భారీగా డబ్బు ఖర్చు పెట్టారని విమర్శలు గుప్పించారు. డబ్బుతో ఎన్నికలు చేయడం పెద్దిరెడ్డి అలవాటు చేశాడాని, ప్రజలు దీనిని తిప్పికొట్టి ప్రజాస్వామ్యయుతంగా ఓటు వేశారని అన్నారు.