- రాజ్యాంగ నిర్మాత ఆశయాలను కొనసాగించేది టీడీపీయే..!!
- చంద్రగిరి నియోజకవర్గం తెలుగు దేశం పార్టి ఇన్ చార్జ్ పులివర్తి నాని.
తిరుపతి: అందరివాడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అన్నారు చంద్రగిరి నియోజకవర్గం తెలుగు దేశం పార్టి ఇన్ చార్జ్ పులివర్తి నాని.
రాజ్యాంగ నిర్మాత ఆశయాలను కొనసాగించేది టీడీపీయేనన్నారు.
ప్రపంచ మేధావి, భారత రాజ్యాంగం నిర్మాత, భారతదేశం మొట్టమొదటి న్యాయ శాఖ మంత్రి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా టీడీపీ సీనియర్ నేత పులివర్తి నాని శుక్రవారం ఆ మహానుభావుని చిత్రపటానికి పూలమాలలు వేసి, ఘన నివాళులు అర్పించారు. అంబేద్కర్ స్పూర్తిని కొనియాడారు.ఈ సందర్భంగా నాని మాట్లాడుతూ సమసమాజ స్దాపనకు కృషి చేసిన మహోన్నత వ్యక్తి అంబేద్కర్ అన్నారు. బడుగు, బలహీనవర్గాల స్థితిగతులను అధ్యయనం చేసి,
వారి అభ్యున్నతకి రిజర్వేషన్లు కల్పించి, వారి జీవితాల్లో వెలుగులు నింపిన బడుగుల ఆశాజ్యోతి అంబేద్కర్ అన్నారు. అలాగే అంటరానితనం, అస్పృశ్యతను శిక్షార్హమైన నేరంగా చేసి, భవిష్యత్ తరాలకు మార్గనిర్దేశం చేసిన మేధావి అని తెలిపారు. అంతేకాదు ఆర్థికవేత్తగా కూడా ఎంతో గొప్పగా పేరు సంపాదించి..,భారతదేశ ప్రగతికి బాటలు వేసారని చెప్పారు. పారిశ్రామికీకారణ, వ్యవసాయాభివృద్ధి దేశానికి ఊతమిస్తాయని బలంగా నమ్మిన నిజమైన భారత పౌరుడు అంబేద్కర్ అని నాని కొనియాడారు.ఆయన బాటలో పయనిస్తూ సమాజ సేవకు అంకితమవుతామని ఆయన నినదించారు.