తిరుపతి, శ్రీకాళహస్తి: నీటిపారుదల ప్రాజెక్టుల విషయంలో తానేదో ఘనత సాధించానని చెప్పుకుంటున్న రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి.., తాను తీసుకున్న రివర్స్ టెండరింగ్ విధానమే నీటి ప్రాజెక్టులు అటకెక్కడానికి కారణమైందనీ తిరుపతి పార్లమెంటు అధ్యక్షులు నరసింహ యాదవ్ ఆరోపించారు.మంగళవారం శ్రీకాళహస్తిలోని తెలుగు దేశం పార్టి కార్యాలయంలో రాష్ర్టంలో నీటి పారుదుల ప్రాజెక్టులు- వ్యవసాయ రంగం అనే అంశంపై జరిగిన సమావేశంలో శ్రీకాళహస్తి నియోజకవర్గం టిడిపి ఇంచార్జ్ సుధీర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఎస్వీ నాయుడుతో కలిసి ఆయన పాల్గొన్నారు. అనంతరం జరిగిన విలేకరుల సమావేశంలో నరసింహ యాదవ్ మాట్లాడారు. వైసీపీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలే నీటి పారుదల ప్రాజెక్టులు అటకెక్కడానికి ప్రధాన కారణం అన్నారు. దీనికి తోడు ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి కూడా ప్రాజెక్టుల విషయంలో చిత్తశుద్ధితో వ్యవహరించడం లేదని విమర్శించారు.ఫలితంగా రాష్ట్రంలో వ్యవసాయ రంగం పూర్తిగా దెబ్బతిందని ఆవేధన వ్యక్తం చేశారు.రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర లభించకపోవడంతో చేసేది లేక ఆత్మహత్యలు చేసుకోవలసిన పరిస్థితి నెలకుంటోందనీ విచారం వ్యక్తం చేశారు.ఇక శ్రీకాళహస్తి నియోజకవర్గం విషయాని కొస్తే… ఇక్కడ పూర్తి చేయాల్సిన నీటి పారుదల ప్రాజెలన్నీ మద్యలోనే ఆగిపోవడం బాధాకరమన్నారు. ప్రస్తుత శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూధన రెడ్డి దోచుకోవడం దాచుకోవడమే పనిగా పెట్టుకున్నారనీ ఆరోపించారు. ప్రజా సంక్షేమాన్ని, నియోజకవర్గ అభివృద్ధిని గాలికొదిలేసిన ఘనత బియ్యపుదేనని విమర్శించారు.దీంతో ఇక్కడి అన్నదాతలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వ్యాఖ్యానించారు. ఈ పరిణామాలను టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకు తెలియజేసి..,ప్రజలకు.., రైతన్నలకు న్యాయం చేసేందుకు కృషి చేస్తామని చెప్పారు నరసింహా యాదవ్.
అనంతరం శ్రీకాళహస్తి నియోజకవర్గం ఇన్ చార్జ్ సుదీర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఎస్సివి నాయుడు మాట్లాడుతూ.. వైసీపీ ప్రభుత్వ పోకడలు రాష్ట్ర అభివృద్ధికి అభ్యున్నతిని అడ్డుకున్నాయనీ ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూధన్ రెడ్డి అనురిస్తున్న విధానాలు నియోజకవర్గానికి శాపంగా మారాయనీ విమర్శించారు.జగన్ ప్రభుత్వం రైతు వ్యతిరేక ప్రభుత్వమనీ..,ప్రజలు ఆలోచించి వైసీపీ సర్కారుకు బుద్ధి చెప్పాలని వారు పిలుపునిచ్చారు