అనంతపూర్, గుత్తి : నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడు సుంకప్ప నాపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే తాట తీస్తానని టిడిపి నాయకుడు గుత్తి ఇంచార్జ్ గుమ్మనూరు నారాయణ తీవ్రంగా హెచ్చరించారు. గుంతకల్లు వైసీపీ పట్టణ అధ్యక్షుడు కౌన్సిలర్ సుంకప్ప నా గురించి మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడు సుంకప్ప అంటూ గుత్తి టిడిపి ఇన్చార్జి గుమ్మనూరు నారాయణ గుంతకల్లు వైఎస్ఆర్సిపి నాయకులను హెచ్చరించారు. మంగళవారం స్థానిక గుత్తిలో ఆర్ అండ్ బి అతిథి గృహంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. గుంతకల్లులో వైసిపి గుంతకల్లు పట్టణ అధ్యక్షుడు సుంకప్ప టిడిపి నాయకులపై చేసిన వ్యాఖ్యలపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన ఘాటుగా స్పందించి నాది ఈ జిల్లా కాదు నాది ఈ ప్రాంతము కాదు అయినప్పటికీ నేను గుత్తి నుండి నీపై మాట్లాడుతున్నా, నేను గుంతకల్ మీదుగానే మా ఊరికి వెళ్తా నువ్వు ఏం చేసుకుంటావో చేసుకో త్వరలో మీ అవినీతి భోగతాన్ని నువ్వు చేసిన మోసాల్ని బహిర్గతం చేస్తా కాస్కో సుంకప్ప అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు ఎంపీటీసీ నారాయణ స్వామి, ఎం కె చౌదరి, లక్ష్మణ్, చిక్కెన్ శ్రీనివాసులు పాల్గొన్నారు.