పల్నాడు జిల్లా కారంపూడి లో నిన్న జరిగిన వీరారాధన ఉత్సవాల సందర్బంగా వీర్ల దేవాలయ సందర్శనకు వచ్చిన జూలకంటి బ్రహ్మారెడ్డి కి టిడిపి కార్యకర్తల నుండి భారీ స్వగతం లభించింది. దివ్యసాయి పబ్లిక్ స్కూల్ వద్ద నుండి బ్రహ్మారెడ్డి ని వందలాది మంది కార్యకర్తలు భుజం పై ఎత్తుకొని ర్యాలీగా వీర్ల దేవాలయం వరకు తరలి వచ్చారు . ఈ ర్యాలీ లో పల్నాటి బాలచంద్రుడు బ్రహ్మారెడ్డి అంటూ నినాదాలు చేసారు. సినిమా హాలు సెంటర్ వద్దకు రాగానే క్రేన్ సాయంతో గజమాలతో బ్రహ్మారెడ్డి ని సన్మానించారు. దారిపొడవునా వీధుల్లో పూల వర్షం కురిపించారు. ఈ కార్యక్రమం లో వంగులూరి పుల్లయ్య, చావా వీరాంజనేయులు, కటికల బాలకృష్ణ, జానీ భాష, మస్తాన్ జానీ, సురేష్ యాదవ్, రాముడు తదితరులు పాల్గొన్నారు.