పల్నాడు జిల్లా , మాచర్ల : మాచర్ల ప్రజలు, ఎన్ డి ఏ కార్యకర్తలు, అందరు ఓట్ల లెక్కుంపు ముందు, తరువాత సంయమనంతో వ్యవహారించాలని టిడిపి నాయకుడు జూలకంటి బ్రహ్మారెడ్డి కోరారు. వైసీపీ పార్టీ ఓటమి భయంతో కౌంటింగ్ రోజున కవ్వింపు చర్యలకు పాల్పడే అవకాశం ఉందని ఇటీవల సజ్జల రామకృష్ణ రెడ్డి చేసిన వ్యాఖ్యల ముఖ్య ఉద్దేశమని జులకంటి బ్రహ్మారెడ్డి అభిప్రాయ పడ్డారు. ప్రజలు, కార్యకర్తలు అందరు ఫలితాలు వెలువడే రోజున, తరువాత సంయమనంతో భాద్యతగా వ్యవహరించాలని, వ్యవస్థలన్నిటికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు.