పల్నాడు జిల్లా పిడుగురాళ్ళ పట్టణంలో గురజాల మాజీ శాసన సభ్యులు యరపతినేని జన్మదినం సందర్భంగా ముందుగా నాయకులు , అభిమానులు స్థానిక హెచ్.పి పెట్రోల్ బంక్ సమీపంలో ఏర్పాటు చేసిన కట్ అవుట్ ను మున్సిపల్ అధికారులు ఎట్టకేలకు తొలగించారు. తొలగించేందుకు వచ్చిన అధికారులు కు తెదేపా కార్యకర్తలు , నాయకులు , అభిమానులుకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. దీనితో పోలీసులు రంగ ప్రవేశం చేసి కొందరిని పోలీస్ స్టేషన్ కు తరలించారు.