- బాబు పర్యటనను విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చిన తిరుపతి పార్లమెంట్ అధ్యక్షుడు నరసింహా యాదవ్..!!
తిరుపతి: ఈనెల 4, 5 తేదీలలో తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉమ్మడి చిత్తూరు జిల్లాల పర్యటనకు విచ్చేయనున్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు పర్యటనను విజయవంతం చేయాలని తిరుపతి పార్లమెంటు అధ్యక్షుడు గొల్ల నరసింహ యాదవ్ పార్టీ నాయకులు, కార్యకర్తలకు, అనుబంధ సంఘాల కమిటీ సభ్యులకు పిలుపునిచ్చారు. ఇదే అంశంపై బుధవారం తిరుపతి పార్లమెంట్ కార్యాలయంలో తిరుపతి పార్లమెంట్ కార్యవర్గం , అనుబంధ కమిటీలతో పార్లమెంట్ అధ్యక్షులు గొల్లనరసింహ యాదవ్ సమావేశమై దిశ నిర్దేశం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబునాయుడు ఈ నెల 4న పూతలపట్టు నుండి రాత్రి 9 గంటలకు రేణిగుంట వై- కన్వెన్షన్ కు చేరుకుని.. రాత్రి అక్కడే బస చేస్తారని చెప్పారు. అలాగే 5వ తేదీన ఉదయం 9 గంటలకు వై కన్వెన్షన్ నుండి బాలాజీ రిజర్వాయర్ సందర్శిస్తారని తెలిపారు. అనంతరం బాలాజీ రిజర్వాయర్ నుండి శ్రీకాళహస్తిలో ఉదయం 11 గంటలకు రోడ్ షో , బహిరంగ సభ ముగించుకొని మధ్యాహ్నం శ్రీకాళహస్తి నుండి నెల్లూరుకి చేరుకుంటారు అని వెల్లడించారు.
రాయలసీమ ప్రాజెక్టుల నిర్మాణానికి టిడిపి ప్రభుత్వం, వైసీపీ చేసిన ఖర్చు వివరాలు
రాయలసీమలోని నాలుగుజిల్లాలకు 2014-19లో రూ.8,291 కోట్లు ఖర్చు నీరు ప్రగతి కార్యక్రమం క్రింద రూ.4,150కోట్లు, మొత్తం కలిపి ఐదేళ్లలో రూ.12,441 కోట్లు రూపాయలను నాటి టీడీపీ ప్రభుత్వం ఖర్చు చేసిందని నరసింహా యాదవ్ వివరించారు.
ఇక వైసీపీ ప్రభుత్వం 2019-23 మధ్యన కేవలం రూ.2,011కోట్లు మాత్రమే ఖర్చుపెట్టిందన్నారు. రాయలసీమకు ఇంత తక్కువ ఖర్చుపెట్టిన వైసీపీ ప్రభుత్వ పెద్దలు సీమద్రోహులు కాదా? సీమవాసుల నీటి కష్టాలు
తేర్చాల్సిన బాధ్యత మీకు లేదా ? అని నిలదీశారు. రాయలసీమను రతనాలసీమను చేస్తామన్న హామిని కొంతవరకు టిడిపి అమలుచేసిందనీ. తిరిగి అధికారంలోకి వచ్చి ఉంటే, అన్ని ప్రాజెక్టులు పూర్తి చేసేదన్నారు నరసింహా యాదవ్.
రాయలసీమలోని 102 ప్రాజెక్టుల్ని ఫ్రీక్లోజర్ చేసిన జగన్ సీమ ద్రోహి కాదా ?
జగన్ ప్రభుత్వం 198 ప్రాజెక్ట్ లకు సంబంధించిన టెండర్లు మొత్తాన్ని ప్రిక్లోజర్ చేసిందన్న పార్లమెంటు అధ్యక్షుడు నరసింహా యాదవ్.., రాయలసీమలోని 102 ప్రాజెక్టుల పనులు ఆపేసి, కాంట్రాక్ట్ సంస్థలకు బ్యాంక్ గ్యారెంటీలు వెనక్కు ఇచ్చేసిన చరిత్ర వైసీపీ ప్రభుత్వానిదని దుయ్యబట్టారు. సీమ ప్రాజెక్టుల పనులు ఆపేసిన వారు రాయలసీమ ద్రోహి కాక రక్షకుడు అవుతాడా అని వ్యాఖ్యానించారు.
గుండ్లకమ్మ ఏమైంది? పులిచింతల గేట్లు ఎందుకు కొట్టుకుపోయాయి? సుంకేశుల ప్రాజెక్ట్ పరిస్థితిఏమిటి? అని ఆయన ప్రశ్నలవర్షం కురిపించారు. జగన్ రెడ్డి ముమ్మాటికి రాయలసీమ ద్రోహి అనడానికి ఆ ప్రాంతంలోని ప్రాజెక్టుల్లో నాలుగేళ్లలో జరిగిన పనులే నిదర్శనమన్నారు. రాష్ట్ర చరిత్రలో ఏ ముఖ్యమంత్రి చేయనంత ద్రోహం, అన్యాయం జగన్ రాయలసీమకు చేశాడని ఆరోపించారు. జగన్ పోవాలి.. సీమలో సిరులు పండాలి. అదే నిజమవుతుందన్నారాయన.
కరువు ప్రాంతాన్ని కరువు ప్రాంతంగా చూడకుండా, కులాలు మతాలు, ప్రాంతాల మధ్య విద్వేషాలు రాజేస్తున్నారు అని తెలిపారు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు పర్యటనలో పార్టీ శ్రేణులు పాల్గొని విజయవంతం చేయవలసిందిగా తిరుపతి పార్లమెంట్ ప్రజలకు, తెలుగుదేశం పార్టీ నాయకులకు ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు వేనాటి సతీష్ నాయుడు, కార్యాలయం కార్యదర్శి చేజర్ల మనోహర్ ఆచారి, వాణిజ్య విభాగ అధ్యక్షులు వేణుగోపాల్ నాయుడు, మహిళా అధ్యక్షురాలుఉషా చక్రాల, బీసీ కమిటీ అధ్యక్షులు రుద్రకోటి సదాశివం, యువత అధ్యక్షులు కృష్ణ యాదవ్,టిఎన్టియుసిఅధ్యక్షులు జయరామిరెడ్డి, రాష్ట్ర రైతు విభాగ నాయకులు గోపీనాథ్ రెడ్డి, టిఎన్టియుసి జనరల్ సెక్రెటరీ కరాటి చంద్ర, అధికారప్రతినిధి బిల్లు చెంచయ్య యాదవ్, యనమల దినేష్, లోకయ్య రెడ్డి,యశ్వంత్ రెడ్డి, రాజయ్య, రామంజి వాసు, చెంగయ్య తదితరులు పాల్గొన్నారు.