పల్నాడు జిల్లా : పిడుగురాళ్ల పట్టణంలో రేషన్ వ్యవస్థను నిర్వీర్యం చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరికి నిరసనగా పట్టణ కార్యాలయం నుండి ర్యాలీగా బయలుదేరిన తెలుగుదేశం పార్టీ శ్రేణులు స్థానిక తహసిల్దార్ వారికి వినతి పత్రం అందజేయటం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశిస్తూ పట్టణ పార్టీ అధ్యక్షులు పాండురంగ శ్రీను, మండల పార్టీ కన్వీనర్ గండికోట వెంకటేశ్వర్లు, పల్నాడు జిల్లా మైనార్టీ అధ్యక్షులు సయ్యద్ అమీర్ ఆలీ మాట్లాడుతూ ప్రజలకు ఆహార భద్రత కల్పించడం అనేది రాజ్యాంగం కల్పించిన హక్కు ఆ హక్కును కాలరాస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిత్యవసర వస్తువుల ధరలపై నియంత్రణ కోల్పోవడం, రేషన్ షాపులు ఇచ్చే సరుకులపై నాణ్యత కోల్పోవడం, కందిపప్పు పంచదారపై రేట్లు అమాంతం పెంచడం చూస్తుంటే ఈ ప్రభుత్వం పేదలపై చిత్తశుద్ధి ఏమిటో తెలుస్తుంది. గత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో పేద ప్రజలను దృష్టిలో పెట్టుకుని రంజాన్ తోఫా సంక్రాంతి కానుక క్రిస్మస్ కానుక అంటూ పేద ప్రజలకు ఉచితంగా రేషన్ పంపిణీ చేయడం జరిగింది. ఈ ప్రభుత్వం మాయమాటలు చెప్పి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పేద ప్రజల్ని మోసం చేయడం నేర్చుకుంది.రేషన్ వ్యవస్థ ద్వారా ఇవ్వాల్సిన సరుకుల సంఖ్యను తగ్గించి కేవలం బియ్యానికి పరిమితం చేశారు ఇది ఆహార భద్రత చట్టాన్ని ఉల్లంఘించడమే, బియ్యంతో పాటు కందిపప్పు పంచదార చిరుధాన్యాలు గోధుమ పిండి వంటివి కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంది.ఇచ్చి వెంటనే పేద ప్రజల్ని ఆదుకోవాలని లేని పక్షంలో పేదల పక్షాన పోరాటం చేయటానికి తెలుగుదేశం పార్టీ సిద్ధంగా ఉందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలోపట్టణ పార్టీ అధ్యక్షులు పాండురంగ శ్రీను, మండల పార్టీ కన్వీనర్ గండికోట వెంకటేశ్వర్లు, రాష్ట్ర ఎస్సీ సెల్ కార్య నిర్వాహక కార్యదర్శి పణితి రవి, పల్నాడు జిల్లా మైనార్టీ అధ్యక్షులు సయ్యద్ అమీర్ అలీ, పల్నాడు జిల్లా తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు మేకల సాంబశివరావు, పల్నాడు జిల్లా మహిళా కార్యదర్శి పాదర్తిరాజేశ్వరి, నియోజకవర్గ అధికార ప్రతినిధి వడ్డవల్లి సాంబశివరావు, మండల తెలుగు మహిళ అధ్యక్షురాలు పరుచూరి వెంకటరమణ, మండల తెలుగు యువత అధ్యక్షులు షేక్ ఖాసిం సైదా, మహిళా ప్రధాన కార్యదర్శి చేవూరి సుబ్బాయమ్మ,, కారుచూల సీతమ్మ, మండల రైతు అధ్యక్షులు నెక్కంటి శ్రీను, పట్టణ బీసీ సెల్ అధ్యక్షుడు వల్లపు రామకృష్ణ, పల్నాడు జిల్లా తెలుగు యువత కార్యదర్శి గుజ్జర్లపూడి కరుణాకర్, జమ్మిశెట్టి జెమిని రామకృష్ణ , బిజిలి వెంకట్రావు, చిలకా చిన్న, పణితి కృష్ణ, వాచర్ బుడే, నీరుమళ్ళ శ్రీను, KSN షైదా,షేక్ షఫీ,ఐ టీడీపీ మేకల మరియబాబు, దూదేకుల రాజు, పణితీ అఖిల్, మామిళ్ళ శివ, కుంచపు శ్రీను,ఉన్నం సురేష్, ముజావర్ సైదా, గురజాల మౌలాలి, కుంచపు నాగలింగేశ్వరరావు, మీసాల మరియదాసు, SC సెల్ అధ్యక్షులు లంజపల్లి కొండలు,నడికుడి వెంకటేశ్వర్లు, కారు కొల్ల నాగరాజు, మేకల వెంకటేశ్వర్లు షేక్ చిన్న నాసర్ వలి, సయ్యద్ అబ్దుల్లా, బుంగా సాంబ, బండారు రవితేజ, రాంబాబు తదితరులు పాల్గొన్నారు.