కుప్పం నియోజకవర్గంలో చంద్రబాబు గారిని అడ్డుకున్నందుకు నిరసనగా.. జగన్ రెడ్డి ప్రభుత్వం ప్రజాస్వామ్య విలువలకు తూట్లు పొడుస్తున్నారని, ప్రతిపక్షాలు అణిచివేతకు గురి చేస్తున్న విధానాన్ని నిరసిస్తూ.. అప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా జీవో నెంబర్-1 కాపీలను తీసుకోని, నల్ల బ్యాడ్జీలు కట్టుకోని ఈరోజు పిడుగురాళ్ల పట్టణ తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుండి మెయిన్ రోడ్ వరకు గురజాల మాజీ శాసనసభ్యులు శ్రీ యరపతినేని శ్రీనివాసరావు ఆధ్వర్యంలో పిడుగురాళ్ల పట్టణ మరియు మండల తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు ర్యాలీగా వెళ్లి నిరసన తెలియజేసి, చీకటి జీవోలను తగలబెట్టి, పిడుగురాళ్ల మండల ఎమ్మార్వో కి వినతి పత్రాన్ని సమర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పిడుగురాళ్ల పట్టణ మరియు మండల తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ, పట్టణ, మండల, గ్రామ, టౌన్ స్థాయిల్లో వివిధ హోదాల్లోని తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.