అనంతపురం జిల్లా గుత్తి ఆర్ యస్ లో గల విద్యుత్ శాఖ కార్యాలయం వద్ద తెలుగుదేశం పార్టీ నాయకులు నిరసన కార్యక్రమం చేపట్టారు. గుత్తి మండల ఇంచార్జ్ హరినాథ్ గౌడ్ మాట్లాడుతూగతంలో ఇంతవరకు ఏ ప్రభుత్వం 8 సార్లు విద్యుత్ ఛార్జీలను పెంచలేదు కనుక పెంచిన విద్యుత్ చార్జీలను వెంటనే తగ్గించాలంటూ డిమాండ్ చేస్తూ, అప్రకటిత విద్యుత్ కోతలు ఆపాలంటూ రైతుల వ్యవసాయ భూముల వద్ద మోటార్లకు మీటర్లు బిగింపు చర్యలను వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ఉపసంహరించుకోవాలంటు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రజలు రైతులు పెద్ద ఎత్తున నిరసన తెలియజేస్తూ ధర్నాకు దిగారు.
ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు ఎంపీటీసీ నారాయణ స్వామి మాజీ ఎంపీపీ వీరభద్రుడు, బి.శ్రీనివాసులు, భద్రువలి, ఐడియా రవి, కొత్తూరు కృష్ణ, వన్నెదొడ్డి, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.